ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ సీఎంగా వైసీపీ అధినేత వైస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన ఏ విధంగా అయితే ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారో అలాగే త్వరితగతిన పూర్తిచేస్తున్నారు. హామీలో భాగంగా వైయస్ కంటివెలుగు, రైతు భరోసా... ఇలా పధకాలు పూర్తి చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలోని దాదాపుగా అన్ని ఆలయాలకు పాలకవర్గాలకు నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్.
 
 
నామినేటెడ్ పదవుల్లో  ఎస్సీ - ఎస్టీ - బీసీ - మహిళలకు కోటా ఉంటుందని ప్రకటించారు... ఈ కోటాను ఆలయాల కమిటీల ఏర్పాటులోనూ అమలు చేసేశారు. సోమవారం ఉదయాన్నే రాష్ట్రంలోని 1448 ఆలయాలకు కమిటీలను ప్రకటించేసిన జగన్ సర్కారు... అందులో 10256 మందికి పదవులు కట్టబెట్టేసింది.అన్ని కేటగిరీలకు చెందిన పదవుల్లో సగం పదవులను మహిళలకు కేటాయించారు.
 
 
 
ఈ కోటాకు సంబంధించి ఇతర పాలక వర్గాల విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేకున్నా, ఆలయ పాలకవర్గాల దగ్గరకొచ్చేసరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్వయంగా వైసీపీ శ్రేణులే వాదిస్తున్నాయి.అన్నీ హిందూ ఆలయాలే అయినప్పుడు ఒక్క టీటీడీలో మాత్రమే ఈ కోటా ఇబ్బంది తెస్తుందని భావించిన జగన్ సర్కారు.. మిగిలిన ఆలయాల విషయంలో ఇబ్బంది లేదని భావించింది.  క్షేత్రస్థాయిలో ఆలయాల కమిటీల విషయంలో ఈ కోటాతో చాలా ఇబ్బందులు ఉంటాయని వైసీపీకి చెందిన చాలా మంది నేతలు భావిస్తున్నారు.
 
 
 
 
ఈ విషయంపై జగన్ మరోమారు ఆలోచించాల్సి ఉందని ఆలయాల కమిటీల వరకు ఈ కోటాను ఎత్తివేస్తేనే బాగుంటుందన్నది వారి భావనగా వినిపిస్తోంది. అందరికీ సమాన హక్కులు కల్పించాలని అన్ని వర్గాలకు సమ న్యాయం చేయాలన్న భావనతో వెళుతున్న జగన్. ఏది ఏమైనా ఆలయాల కమిటీల విషయంలో కోటాను అమలు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై పార్టీలోని మెజారిటీ నేతలు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఈ విశ్లేషణలు - పార్టీ నేతల్లో ఉన్న భయాలు జగన్ వద్దకు ఎప్పుడు చేరతాయో ఆలయాల విషయంలో కోటాపై జగన్ ఎప్పుడు పునరాలోచన చేస్తారో  అందరూ వేచి చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: