ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ దేశమంతటా పడింది. ఆర్థిక మాంద్యం ఎఫెక్టుతో కొన్ని సంస్థలు తమ తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల ను తొలగిస్తున్నాయి . ఆర్థిక మాంద్యం  ఎఫెక్ట్ తో  అన్ని రంగాలు నష్టాల బాటలో నడుస్తున్న డంతో... ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి అన్ని సంస్థలు . అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక మాంద్యం దేశంలో తగ్గించేందుకు వివిధ సంస్కరణలు తీసుకు వచ్చి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.  ఆర్థిక మాంద్యం  ఎఫెక్ట్ ని కొంచెం కొంచెంగా తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఆర్థికమాంద్యం ఎఫెక్ట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పై కూడా పడినట్లు ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. 

 

 

 

 

 ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న హోం గార్డులను తొలగించేందుకు నిర్ణయించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ లో బడ్జెట్ లోటు కారణంగా 25వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు  ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . కాగా  ఒకేసారి 25,000 మంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు  నిర్ణయం తీసుకోవటం తో ఈ నిర్ణయం  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్రంలో ఉన్న  హోంగార్డులకు ప్రభుత్వం బడ్జెట్ లేని కారణంగా  జీతాలు చెల్లించలేకపోతుందని... అందుకే హోంగార్డ్ లను  విధుల నుంచి తొలగించినట్లు ప్రభుత్వం చెబుతోంది. 

 

 

 

 

 ఇదిలా ఉంటే రాష్ట్రంలో హోంగార్డు గా విధులు నిర్వహిస్తున్న మిగతా 99 వేల మందికి... రోజువారి వేతనం చెల్లించడానికి నిర్ణయం తీసుకుంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. హోంగార్డులకు ఎక్కువ మొత్తంలో జీతాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని అందువల్లే హోంగార్డులకు రోజువారి వేతనం 500 రూపాయలు చెల్లిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా హోంగార్డ్ ల  పని దినాలను కూడా కుదించేందుకు  నిర్ణయం తీసుకుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. హోంగార్డుల పనిదినాలను 25 రోజులు కాకుండా 15 రోజులకే కుదించనున్నట్లు  సంచలన నిర్ణయం తీసుకుంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంతో హోంగార్డుల ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హోంగార్డులు వాపోతున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి 25వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించడంతో... వేల కుటుంబాలు ఒకే సారి ఉపాధి కోల్పోనున్నాయి. అయితే ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని పలువురు ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు.అయితే  అందరి జీవితాలలో వెలుగులు నింపేందుకు  జరుపుకునే దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ... ఉత్తరప్రదేశ్లో 25వేల మంది హోంగార్డులు  ఉద్యోగం కోల్పోవడంతో...వాళ్ళందరి  అందరి కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: