ఆంధ్ర ప్రదేశ్  సీఎం జగన్ వ్యవసాయ శాఖ పై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. “రైతు భరోసా పథకం కింద ముందుగా ప్రకటించిన సంవత్సరానికి రూ.12000  మొత్తానికి మరింత భరోసాను యాడ్ చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. సంవత్సరానికి  వెయ్యి రూపాయల చొప్పున పెంచి, ప్రతియేటా రూ. 13500 మొత్తాని పెట్టుబడి సాయంగా అందించనున్నట్టుగా ప్రభుత్వం తెలియచేసింది అలాగే ఈ పథకం అమలులో పలు మార్పులు కూడా  చేయడం జరిగింది.


అదే విధంగా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ఇక నుంచి “వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్” గా మార్చాలని జగన్ అధికారులకు ఆదేశలు జారీ చేసారు. ఈ సంవత్సరానికి ఇప్పుడు భరోసాను అందిస్తున్నప్పటికీ, వచ్చే ఏడాది నుంచి మూడు విడతలుగా ఈ సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సమయంలో ఒక విడత, మేలో మరో విడత, నవంబర్లో మూడో విడత పెట్టుబడి సాయాన్ని అందించనున్నట్టుగా తెలియచేశారు.


 రైతు సంఘాల కోరిక మేరకు ఈ మేరకు మార్పును చేసి, ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున సాయాన్ని పెంచి.. ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా తెలిపింది జగన్ సర్కార్. ఈ రైతు భరోసా పథకాన్ని మూడు విడతలుగా అందజేయాలని నిర్ణయించారు. మే నెలలో రూ.7500, రబీ సీజన్ లో రూ.4000, సంక్రాతి సమయాన రూ.2000 వేల రూపాయలు విడతల వారీగా సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


అలాగే రైతు భరోసా పథకంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఈ పథకం పేరులో ప్రధానమంత్రి సాయం అనేమాటను కూడా కలపడం జరిగింది. ఇక  పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఈ పథకంలో ఆరువేల రూపాయల వరకూ ఉంది. మిగిలిన ఏడువేల ఐదు వందల రూపాయల మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వాటా అన్నమాట. ఈ పథకం అమలుకు ఇప్పటికే ఐదువేల కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.సీఎం జగన్ రైతు భరోసా సాయాన్ని పెంచడం పై రైతు సంఘం ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: