తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 11వ రోజుకు చేరుకుంది. అయితే తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం  ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెడుతుంది తప్ప... కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించడం లేదు. దీంతో ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ కార్మికులు అన్ని పార్టీలు... ఉద్యమ సంఘాల మద్దతు కూడగట్టుకొని ఆర్టీసీ  సమ్మెను రోజురోజుకూ ఉదృతం చేస్తున్నాయి. అయితే ఆర్టీసీ సమ్మె పై ఆగ్రహించిన ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె చేస్తున్న కార్మికులను  విధుల నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం  తీసుకోవడం... ఆర్టీసీ కార్మికుల గత నెల జీతాలు చెల్లించకపోవడంతో  మనస్తాపం చెందిన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 

 

 

 

 

 

 తమ బలిదానాల తోనైనా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందని ప్రాణాలు అర్పిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. కాగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలర్పిస్తూ ఉండడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ అధికార టిఆర్ఎస్ పార్టీపై భగ్గుమంటున్నాయి . ఆర్టీసీ కార్మికులు తమకు న్యాయం జరగడానికి ప్రాణాలర్పిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం పై స్పందించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని...  ఏదైనా ఉంటే బతికి సాధించుకుందామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మెతో... ఈనెల 21 నిర్వహించబడే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. 

 

 

 

 

 

 మొదటి టీఆర్ఎస్ కి  మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పిన సిపిఐ పార్టీ ఆర్టీసీ  కార్మికుల సమ్మె  టిఆర్ఎస్  వ్యవహరిస్తున్న తీరును చూసి తన మద్దతు ఉపసంహరించుకుంటూ తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా కార్మికుల తరఫున పోరాడి తమకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. సిపిఐ మద్దతు ఉపసంహరించుకోవడంతో టిఆర్ఎస్ కు  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీ షాక్ తగిలినట్లయింది. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్టీసీ సమ్మె పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి... ఆర్టీసీ సమ్మె పై స్పందిస్తూ ఆర్టీసీ సమ్మె వెనుక ఉన్నది మా వాళ్లే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు ఆజ్యం పోస్తుంది టిఆర్ఎస్ పార్టీ వాళ్లేనని  అన్నారు ముత్తిరెడ్డి. ఆర్టీసీ సమ్మె వెనుక టిఆర్ఎస్ పార్టీ నేతలే ఉన్నారని  వార్తలు వినిపిస్తున్నాయని ముత్యం రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా ఈ విషయం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని ఎవరెవరు ఆర్టీసీ సమ్మెకు ఆజ్యం పోస్తున్నారు అనే వివరాలను కూడా పేర్లతో సహా తన దగ్గర ఉన్నాయని ముత్తిరెడ్డి ఆఫ్ ది రికార్డు లో  అన్నారు . కాగా ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేససే  ఎమ్మెల్యేగా కూడా పేరుంది. ఒకవేళ ముత్తిరెడ్డి వ్యాఖ్యలే నిజమైతే సమ్మె వెనుక టిఆర్ఎస్ నాయకులు ఉంటే వాళ్ళ పై కెసిఆర్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: