సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల.  సొంత ఇల్లు కట్టుకోవాలని అందులో ఉండాలని అందరు అనుకుంటారు.  అయితే, కొందరికే ఆ అవకాశం వస్తుంది.  వచ్చిన అవకాశాన్ని కొంతమంది మాత్రమే సద్వినియోగం చేసుకుంటారు.  పేద, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు అన్నది ఇప్పుడు ఆకాశంలో ఉన్న ద్రాక్షలా మారిపోయింది.  సంవత్సరాల తరబడి అద్దె ఇంట్లోనే ఉంటూ.. అద్దె కట్టుకుంటూ తిరుగుతుంటారు.  అయితే, ఇప్పుడు మోడీ ప్రభుత్వం సొంత ఇల్లు కట్టుకునే వాళ్లకు ఓ అఫర్ తీసుకొచ్చింది.  


సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వ్యక్తులను వారి ఆదాయాన్ని బట్టి రెండు కేటగిరిలుగా విభజించింది.  మొదటి కేటగిరిలో 6లక్షల నుంచి 12 లక్షల మధ్యలో వార్షిక ఆదాయం వచ్చే వ్యక్తులు ఉంటారు.  12 లక్షల నుంచి 18 లక్షల ఆదాయం వరకు వచ్చే వ్యక్తులు రెండో కేటగిరిలో ఉంటారు.  మొదటి కేటగిరి వ్యక్తులు తీసుకునే హోమ్ లోన్ లో సబ్సిడీ కింద దాదాపుగా 2,35,068 రూపాయలు వస్తుంది.  రెండో కేటగిరికి చెందిన వాళ్లకయితే 2,30,136రూపాయలు సబ్సిడీ కింద వస్తుంది.  


మొదటి కేటగిరిలో ఉన్న వాళ్లకు 9 లక్షల హోమ్ లోన్ కు ఇది వర్తిస్తుంది.  దానిపై ఐదు శాతం వడ్డీ తగ్గిపోతుంది.  అలానే రెండో కేటగిరిలో ఉన్న వ్యక్తులకు 12 లక్షల హోమ్ లోనే పై 3శాతం వరకు వడ్డీ తగ్గిపోతుంది. ఒకవేళ అంతకు మించి ఋణం తీసుకున్నా.. కేవలం సబ్సిడీ అంత వరకు మాత్రమే వర్తిస్తుంది.  మిగతా దానిపై బ్యాంకు నిర్ణయించిన దాని బట్టే వడ్డీ ఉంటుంది.  


ఈ పధకాన్ని ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీం కింద ఏర్పాటు చేస్తున్నారు.  ఈ స్కీం 2020 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.  ఆ తరువాత ఈ స్కీం అందుబాటులో ఉండదు.  అంటే కేవలం ఇంకా 180 రోజులు మాత్రమే సమయం ఉన్నది.  ఆ తరువాత ఈ స్కీంను వినియోగించుకోవాలి అంటే కుదరదని పని అవుతుంది.  కాబట్టి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వ్యక్తులు హోమ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే మార్చి 31 లోపు మాత్రమే తీసుకోండి.  ఆ తరువాత తీసుకున్నా ఉపయోగం ఉండదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: