ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ సుపరిపాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశపెట్టి పొరుగు రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. తన సుపరిపాలన తో ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు జగన్. అయితే ఆంధ్రప్రదేశ్ రైతులకు చేయూతనిస్తూ పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం వైఎస్సార్ రైతు భరోసా పేరిట నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్  ప్రభుత్వం. 

 

 

 

 

 ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా మొదట 12,500 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడానికి నిర్ణయించిన ప్రభుత్వం... రైతులు,  రైతు ప్రతినిధులతో చర్చించి 12,500 రూపాయలు చెల్లించాల్సిన పెట్టుబడి సహాయాన్ని వేయి రూపాయలు పెంచుతూ 13,500 రూపాయలను వైయస్సార్ రైతు భరోసా పథకం కింద రైతులకు అందించేందుకు  నిర్ణయించింది. అయితే వైయస్సార్ రైతు భరోసా- పిఎం కిసాన్ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అయిదేళ్లలో వర్షాలు లేక కరువుతో కొట్టుమిట్టాడారని... కానీ ఈ సంవత్సరం రాష్ట్రమంతటా మంచి వర్షాలు పడి... రిజర్వాయర్ల నిన్ను కుండలుగా మారాయని తెలిపారు  జగన్. రైతులను దేవుడు నిండు మనసుతో ఆశీర్వదించాడని  అందుకే రాష్ట్రమంతటా భారీ వర్షాలు పడడంతో పాటు... గత పదేళ్లుగా వర్షాలు లేక నిండని ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం నిండుకుండలా కనిపిస్తున్నాయని అన్నారు. 

 

 

 

 

 అయితే దేశంలోనే గొప్ప పథకాన్ని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఏ రాష్ట్రం కూడా ఇవ్వనంత ఎక్కువ పెట్టుబడి సాయాన్ని ఒక్క ఏపీ ప్రభుత్వం మాత్రమే రైతులకు అందిస్తుందని జగన్ చెప్పారు. తన పాదయాత్రలో రైతుల ఆవేదనని కళ్లారా చూశానని... రైతులకు సాయం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు. అయితే వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు రైతులకు రైతు భరోసా చెక్కులను అందించారు. కాగా  రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా... ఇచ్చే సొమ్ము మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: