ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా కోట్లమంది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.  ప్రతిపక్షంలో అయినా..అధికార పక్షంలో అయినా ఆయనకు ఆయనే సాటి.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలు ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటారు. ఫీజ్ రియాంబర్స్ మెంట్ తో  ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.  ఆరోగ్యశ్రీ, 108, ఇందిరమ్మ ఇళ్లు ఒక్కటేమిటి ప్రజల కోసం ఆయన ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారు.

ప్రజల కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ..అనంత లోకాలకు వెళ్లారు.  ఆయన తనయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. నేడు నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం కాకుటూరులో రైతు భరోసా పథకం ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. భూమిలేని ప్రతి నిరుపేదకు అండగా ఉండేందుకే 'వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్' పథకాన్ని తీసుకొచ్చామని ఏపీ సీఎం జగన్ అన్నారు.

తన తండ్రి ఆశయాలు తాను నెరవేరుస్తానని..ఆయన ప్రజల కోసం కన్న కలలు నేను నెరవేరుస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.  గత ప్రభుత్వ హయాంలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.  'నాన్న గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో గొప్ప మార్పులు తీసుకొస్తాం. ప్రతి ఏడాది ఖరీఫ్ పంట వేసే సమయానికి మే నెలలో రూ.7,500 ఇస్తాం. అక్టోబరులో మరో రూ.4 వేలు ఇస్తాం. అంతేగాక, ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి సమయంలో మరో రూ.2 వేలు ఇస్తాం. అంటే రూ.12,500కు బదులుగా ఏటా రూ.13,500 ఇవ్వబోతున్నాం.

రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రజా సంకల్ప యాత్రలో చూశానని..అలాంటి కష్టాలు ఇక ముందు ఎవరినీ పడనివ్వబోనని హామీ ఇస్తున్నానన్నారు. . రైతులకు భరోసా ఉంటేనే రాష్ట్రానికి భరోసా ఉంటుంది. నాణ్యతతో కూడిన విత్తనాలు, పురుగు మందులు అందిస్తాం. గ్రామ సచివాలయాల పక్కనే నాణ్యతతో కూడిన విత్తనాలు అందిస్తాం. నెల్లూరులో పెండింగ్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు.  వైఎస్ జగన్  పదవిలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు..ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశ పెట్టడం చూస్తుంటే ప్రజలు నిజంగా రాజన్న మళ్లీ మా ముందుకు వచ్చారని సంబరపడిపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: