మొత్తానికి అనుకున్నట్టే అయింది ఇప్పుడు.ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును మార్చుకోకపోతే,హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో  అధికార పార్టీకి మద్దతు ఇవ్వమని ,ఉపసంహరిస్తామని  ఎప్పుడో హెచ్చరికలు జారీ చేసింది వామపక్ష పార్టీ సీపీఐ.అయితే ఇప్పుడు ఏకంగా అన్నంత పనీ చేసారు . సమ్మెపై కేసీఆర్ వైఖరిలో ఏమాత్రం మార్పు కనపించకపోటంతో  కాసేపటి క్రితమే  సీపీఐ ఈ  సంచలన నిర్ణయం తీసుకుంది. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకున్నట్లు,సీపీఐ సంచలన ప్రకటన చేసింది. దీని ఫలితంగా హుజూర్ నగర్  ఎన్నికలపై  టీఆర్ ఎస్ కు భారీ షాక్ తగులుతుందని పార్టీ నేతలు షాక్ లో ఉన్నటు తెలుస్తుంది.



ఆర్టీసీ కార్మికుల సమ్మెపై  టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని,సీపీఐ అల్టిమేటం జారీ చేసిన సంగతి అందరికి  తెలిసిన విషయమే. ఇందుకు ఈనెల 13వ తేదీ వరుకు  గడువు ఇచ్చింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి గానీ టీఆర్ ఎస్ నుంచి గానీ ఎటువంటి స్పందన లేకపోవటంతో ,ఇక  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అయిన చాడ వెంకట్ రెడ్డి అధ్యక్షతను,సీపీఐ రాష్ట్ర కమిటీ సూర్యాపేటలో సోమవారం సాయంత్రం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు,మరియు కార్మికుల సమస్యలు  పై ప్రభుత్వం చేపట్టిన విధానాల  మీద తీవ్రంగా చర్చించింది. సుధీర్ఘ చర్చల అనంతరం టీఆర్ ఎస్ కు మద్దతు ఉపసంహరించుకోవాలని మెజార్టీ కార్యవర్గం నిర్ణయించారు.కావున ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ కు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేసారు.
ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఖరి వల్లే  టీఆర్ ఎస్ కు మద్దతు ఉపసంహరణకు  ముఖ్యమయిన కారణమని సీపీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించే తీరుపై చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది.

48వేల మంది కార్మికులను తొలగించడం చాలా దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై  చర్చించి త్వరలో ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ చర్చలకు పిలిచి పరిష్కరించాలని  సీపీఐ డిమాండ్ చేసారు. మొత్తంగా హోరాహోరీగా సాగుతున్న హుజూర్ నగర్ బైపోల్స్ లో టీఆర్ ఎస్ కు  ఇది గట్టి ఎదురుదెబ్బే అని చెప్పచు .


మరింత సమాచారం తెలుసుకోండి: