దేశం చూపు మొత్తం మహారాష్ట్ర హర్యానా ఎన్నికలపై ఉంది. హర్యానాలో ఎవరు అధికారంలోకి వస్తారని దానిపై అందరి అందరి దృష్టి ఉంది. కాగా హర్యానాలో ఈనెల 21న ఎన్నికలు జరగనుండగా... 24 ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే హర్యానా ఎన్నికల్లో విజయాన్ని అటు బిజెపి ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎవరికీ  వారు ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. అయితే బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రచారం చేస్తుంది. బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ జన్  ఆశీర్వాద్  యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. అంతేకాదు ఒక టిక్ టాక్ స్టార్ కి అసెంబ్లీ సీట్ కేటాయించటం  సంచలనంగా మారింది. 

 

 

 

 

 ఇదిలా ఉంటే అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఓటర్ మహాశయులను  ఆకర్షించేందుకు హామీల మీద హామీలు ఇస్తుంది. అయితే హర్యానా ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకుని బీజేపీకి షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ హర్యానా మహారాష్ట్ర ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెల్తూనే ... తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందో చెప్తూ ప్రజలను ఆకర్షిస్తోంది కాంగ్రెస్. అయితే  హర్యానా లో  90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.గత పార్లమెంట్   ఎలక్షన్ లలో  10 కి 10 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ...  ఈసారి ఎలాగైనా 90 అసెంబ్లీ స్థానాలకు 90 గెలుచుకోవాలని తీవ్ర కసరత్తు చేస్తోంది. 

 

 

 

 

 అయితే హర్యానా ఎన్నికల ఇన్చార్జిగా  కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ని నియముంచింది కేంద్ర ఎన్నికల సంఘం. హర్యానాలో 1.83 కోట్ల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే హర్యానాలో ఎక్కువగా బీజేపీకి అడ్వాంటేజ్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎలక్షన్ల లో  పదికి పది పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడం...దానికి  తోడు ప్రధాని మోడీ దేశంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుడటం లాంటి అంశాలతో   బీజేపీ వైపే హర్యానా ప్రజలు  మొగ్గు చూపుతున్నట్టు  కనిపిస్తోంది. ఈసారి ఏదేమైనా  హర్యాన లో బంపర్ విక్టరీ కొట్టాలనుకుంటుంది  బిజెపి. దీనికోసం బీజేపీ పెద్దలు కూడా హర్యానాలో ప్రచారం లో పాల్గొని ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలు ఘాటుగానే చేసుకుంటున్నారు.మరి  హర్యానా ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో  తెలియాలంటే ఈ నెల 24 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: