ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే జనం నాడి చక్కగా పసిగట్టారు అని చెప్పుకోవచ్చు . అసలు జనం ఏం కోరుకుంటున్నారు? జనంకి ఏమి చేస్తే  మంచి ఫలితం వస్తుంది,ఎటువంటి పనులు చేపట్టాలి అనే విషయంపై ఆయనకి పూర్తి అవగాహన ఉందని చెప్పచు.అసలు ఏ నిర్ణయాలు తీసుకుంటే... జనం హర్షిస్తారు? జనం హర్షించని నిర్ణయాలు ఒకవేళ  తీసుకోవాల్సి వచ్చినా వాళ్ళకి ఎలా సర్దిచెప్పొచు,ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా..మోదీ పూర్తి క్లారిటీతోనే ముందడుగు వేస్తారనే తెలుస్తుంది.

అందుకు నిదర్శనం ఆర్టికల్ 370 నే,  పార్లమెంటులోపూర్తి  విపక్షం ఉన్నా,పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా కూడా మోదీ దాన్నిరద్దు  చేసి చూపించారు . అంతే కాకుండా జనాలు  ఎప్పటినుండో  ఇబ్బందుల పాలు చేస్తున్న డిమానిటైజేషన్ వంటి కీలక నిర్ణయాల విషయంలోనూ మోదీ వెనుకంజ వెయ్యలేదు. జనాన్ని తీవ్ర ఇబ్బంది పెట్టిన ఇటువంటి  నిర్ణయాలు తీసుకున్నా కూడా,తనపై జనం పెట్టుకున్న నమ్మకానికి  ఎలాంటి చిక్కు రాకుండా చూసుకోవడంలో ఆయనకి ఆయనే సాటి అని చెప్పచు.



 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న  సమయంలో  సోమవారం హర్యానా పర్యటనల్లో, మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫరీదాబాద్ జిల్లా వల్లఢ్ గడ్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం వింటే, ఎవరైనా మోదీ పట్ల ఆకర్షితులు కాక తప్పదు అని  చెప్తున్నారు ప్రజలు. సభలో మోదీ ఏమన్నారంటే,దేశం ప్రస్తుతం ఊహకందని నిర్ణయాలను తీసుకుంటోందని భారత ఓటర్లు ఇచ్చిన శక్తి వల్లనే ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేతమయిన నిర్ణయాలను కేంద్రం తీసుకుందని మోదీ పేర్కొన్నారు.

ఆర్టికల్ 35ఏ వల్ల జమ్మూకశ్మీర్లోని ప్రతిభ కలిగిన యువతకు ఇంకా  ఉద్యోగాలు రాలేదని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం ఇచ్చిన స్ఫూర్తి వల్లే  ఇలాంటి కీలక  నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు, ఇది చాలదా జనానికి.ఆయన  మాటలను బట్టి చూస్తే,మునుముందు  భవిష్యత్తుల్లోనూ మోదీ మరింత  సంచలన నిర్ణయాలు తీసుకోవడం ఖరారు అనే వాదనలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: