ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎంజీఆర్‌ చెన్నై–సికింద్రాబాద్‌ మధ్య వారానికి రెండు చొప్పున ప్రత్యేక  రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఎంజీఆర్‌ చెన్నై –సికింద్రాబాద్‌ (06059/06060) స్పెషల్‌ ట్రైన్‌ అక్టోబర్‌ 18, 20, 25, 27, నవంబర్‌ 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29,డిసెంబర్‌ 1,6, 8, 13, 15, 20, 22, 27, 29 తేదీల్లో సాయంత్రం 7.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.25 కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్‌ 19, 21, 26, 28, నవంబర్‌ 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30, డిసెంబర్‌ 2, 7, 9, 14, 16, 21, 23, 28, 30 తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది.  

కాచిగూడ–కర్నూలు మధ్య నేడు జనసాధారణ్‌ రైలుప్రయాణికుల రద్దీ దృష్ట్యా మంగళవారం (15వ తేదీ) కాచిగూడ–కర్నూల్‌ మధ్య ప్రత్యేక జనసాధారణ్‌ రైలు నడుపనున్నట్లు  దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాచిగూడ–కర్నూల్‌ (07023/07024) స్పెషల్‌ ట్రైన్‌ మంగళవారం ఉదయం 11.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.15కు కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు సాయంత్రం 5 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి రాత్రి 9.30కు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ–నిజామాబాద్‌ (07013/07014) మంగళవారం ఉదయం 11 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.గంటలకు  నిజామాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 3.40 కి బయలుదేరి సాయంత్రం 7.30 కు కాచిగూడ చేరుకుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: