తెలంగాణ  ఆర్టీసీ సమ్మె పై కదిలిన ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ​​రోజు రోజుకి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పెరుగుతున్న మద్దతు పెరుగుతుంది. మరో పక్క ఆత్మహత్య లకు పాల్పడుతున్న కార్మికులు సంఖ్యా కూడా క్రమేణా పెరుగుతూ వస్తుంది. మంగళవారానికి ఆర్టీసీ కార్మికులు చేపట్టున సమ్మె11 వ రోజుకు చేరుకుంది. పాలకుల అంచనాలకు భిన్నంగా సాగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాలతో ఎట్టకేలకాలకు ముఖ్యమంత్రి  కేసీఆర్ లో స్పందన కనిపిస్తుంది.  ఈ పరిణామాలను గమనిస్తున్న సర్కారు మేల్కొంటున్నట్టుగా కనిపిస్తుంది. 


 సమ్మె మొదలై 11 రోజులు గడుస్తున్నా కార్మికులు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. మీ ఉద్యోగాలు పీకేశాం అన్నా బెదరడం లేదు. దీనికి తోడు ఆర్టీసీ కార్మికులకు ఇతర వర్గాలు కూడా మద్దతిస్తున్నాయి. సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. అదే సమయంలో సమ్మెతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. 


ఆర్టీసీ కార్మికుల సమ్మె 11 రోజున టీఆర్‌ఎస్‌ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు చేసిన ప్రకటన కీలక మలుపు తిప్పనుందా? చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలంటూ కేకే ప్రకటన విడుదల చేయడం. కేకే మధ్యవర్తిత్వం వహిస్తే చర్చలకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం వంటి పరిణామాలు సోమవారం ఆసక్తి రేకెత్తించాయి. కార్మికులు సమ్మె విషయంలో మొండివైఖరి విడనాడాలని, విలీనం మినహా ఇతర అంశాల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలంటూ కేకే ప్రకటన చేశారు.


ఈ ప్రకటన విడుదల చేసి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన కేకే... రాత్రి తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. చర్చలకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన దరిమిలా మంగళవారం చర్చలకు సానుకూల వాతావరణం ఉందని అధికార పార్టీ నేత ఒకరు సాక్షికి వెల్లడించారు. మరోవైపు సమ్మె పదో రోజున కార్మికులు అన్ని డిపోల ఎదుట కుటుంబ సభ్యులతో బైఠాయించి నిరసన తెలియజేశారు. జేఏసీ నేతలు గవర్నర్‌ను కలసి తమ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వినతిపత్రం సమర్పించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: