పూర్తిగా నష్టాల ఊబిలో మునిగిపోయిన ఆర్టీసీని రక్షించండి  అని, ప్రభుత్వానికి కార్మిక సంఘాలు మొరపెట్టుకునే ప్రయత్నంలో కార్మికులు ఉంటే..... ఈలోపల "యూఆర్‌ సెల్ఫ్‌ డిస్మిస్డ్‌" అంటూ చేసిన ప్రకటన 48 వేలమంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను  రోడ్డున పడేసాయి.  పైగా చేసింది మరిఎవరో కాదు సాక్ష్యాత్తు  ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కార్మికులు చేసిన పనికి జీతాలు ఇవ్వకుండా 'సెల్ఫ్‌ డిస్మిస్‌' అని  ఆయన ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్ధం కానీ స్థితి లో ఉన్నాం అని పేర్కొన్నారు.


 ఇటు ప్రభుత్వం వేరు, ఆర్టీసీ సంస్థ వేరు  అనే స్థాయికి పరిస్థితి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఉద్యోగ సంఘాల్ని పిలిపించి, వాళ్ళ కోరికలు తీరుస్తాం అని వాళ్ళని  ఆర్టీసీ కార్మికుల సమ్మె  వైపు వెళ్లనీయకుండా  ఘనవిజయం సాధించాను అని  కేసీఆర్‌ అనుకోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఏ స్థాయిలో సత్తా చూపారో  కేసీఆర్‌కి తెలియని విషయం కాదు అని పేర్కొనాలి.
పైకి కనిపిస్తున్నది 48 వేలమంది కార్మికులే అయినప్పటికీ, ఆ 48 వేల ఉద్యోగాలు కొత్తగా ఇంకొకరికి  ఇస్తే, కేసీఆర్‌ పప్పులు ఉడకవు అనే వాదన వినిపిస్తుంది.

ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడిన విషయం అందరికి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలోను  ఈ బలవన్మరణాలే అత్యంత కీలకపాత్ర పోషించాయి. వాటిని కేసీఆర్‌ ఏ స్థాయిలో రాజకీయంగా  చేసారో ప్రత్యేకంగా ప్రజలకి చెప్పాల్సిన పనిలేదు. అప్పుడు ఉద్యమం పేరుతో రాజకీయం చేసి.. ఇప్పుడేమో, విపక్షాలు ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో రాజకీయం చేస్తోందని కేసీఆర్‌  మరియు అయన అనుచరులు అని ఆరోపిస్తున్నారు .


నేడు ఆర్టీసీ.. రేపు మీరు.. మీదాకా వస్తేనేగానీ మీకు కేసీఆర్‌ నిజస్వరూపమేంటో అర్థంకాదు అని కార్మిక సంఘాల నుంచి ఘాటయిన ప్రశ్నలతో ఉద్యోగ సంఘాలూ పునరాలోచనలో పడ్డాయి.ఆర్టీసీ కార్మికుల సమ్మెని పరిష్కరించడం కేసీఆర్‌కి పెద్ద పనేమీ కాదు కానీ, ఆయన ఆ సమస్యని పరిష్కరించే తీరు కన్పించడంలేదు అని చెప్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ,కేసీఆర్‌ తనకు తానుగా సెల్ఫ్‌ డిస్మిస్‌.. అనే విధానాన్ని ప్రయోగించుకుంటునట్టే అంటున్నారు అన్ని వర్గాల ప్రజలు.


మరింత సమాచారం తెలుసుకోండి: