ఆర్టీసీ సమ్మె పదకొండో రోజుకు చేరుకున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు డిమాండ్ పై సరైన పరిష్కారం దిశగా ఆలోచించలేదు. అంతే కాకుండా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను  ఉద్యోగాల  నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దీంతో ఆగ్రహించిన ఆర్టీసీ కార్మికులు... తమ వాదనను  హైకోర్టులో వినిపించారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మెపై  హైకోర్టులో వాదనలు జరిగాయి. సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ కార్మికులు హైకోర్టులో వేసిన పిటిషన్ పై  నేడు విచారణ జరిపింది హైకోర్టు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని సూచించింది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని హై కోర్టు తెలిపింది.

 

 

 

 

 

 అయితే ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మెను విరమించి  ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని హైకోర్టు సూచించింది. అటు ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించి తమ డిమాండ్లను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు . అంతేకాకుండా ఆర్టీసీకి వెంటనే ఎండి ని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది . పండుగలు పాఠశాలల సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం ఎంత వరకు సమంజసమని హైకోర్టు ప్రశ్నించింది. అయితే హైకోర్టులో ఇటు ప్రభుత్వానికి అటు ఆర్టీసీ కార్మికులకు మొట్టికాయలు పడ్డట్టయింది. ఆర్టీసీ సమ్మె   కేవలం ఆర్టీసీ యాజమాన్యం,  కార్మికుల సమస్య కాదని మొత్తం రాష్ట్ర ప్రజల  సమస్య అని తెలిపింది  హైకోర్టు. అయితే అటు ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యపడుదని హైకోర్టు  చెప్పింది.

 

 

 

 

 ఒకవేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే  మిగతా ప్రభుత్వరంగ సంస్థలు కూడా అదే డిమాండ్ ని  తెరపైకి తేవటానికి అవకాశం ఎంతైనా ఉందని  ప్రభుత్వం హైకోర్టుకు  తెలిపింది. కాగా హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేసింది . అయితే తెలంగాణలో రోజురోజుకి సమ్మె ఉదృతం అవుతుంది.  ఆర్టీసీ కార్మికులు బలిదానంతో సమ్మె ఉధృతం అవుతుండగా ... పలువురు రాజకీయ ప్రముఖులు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని...  ఆర్టిసి కార్మికులు,  ప్రభుత్వం కూడా చర్చకు ముందుకు రావాలని చెబుతున్నారు . అయితే ప్రస్తుతం హైకోర్టు కూడా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి తెలపడంతో... ఇప్పటికైనా ప్రభుత్వం,  ఆర్టీసీ కార్మికుల చర్చలకు సిద్ధం అవుతారా  లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: