ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్టే  తెలంగాణలో కూడా ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆర్టిసి సమ్మె మొదలు పెట్టారు కార్మికులు . అయితే సమ్మె మొదలై   11వ రోజుకు  చేరుకున్నప్పటికీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేదు తెలంగాణ ప్రభుత్వం. అయితే మొదటి నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది ప్రభుత్వం.  ఆర్టీసీ కార్మికుల పిటిషన్  పై విచారించినా  హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని అందువల్ల  ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం కూడా చర్చకు సిద్ధం చేయాలని సూచించింది. 

 

 

 

 

 కాగా  ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఇప్పటికే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. కాగా ఆర్టీసీ ఉద్యోగులు తమకు న్యాయం జరగడం లేదు అనే ఆలోచనతో బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో  సమ్మె రోజు రోజుకు ఉదృతంగా  అవుతుంది. ఈ నెల 19న తెలంగాణ బందుకు పిలుపునిచ్చింది తెలంగాణ ఆర్టీసీ జేఏసీ .కాగా  ఇబ్రహీంపట్నం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కెసిఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో అది ఎందుకు కుదరదు అని వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిన్న వయసులోనే సీఎంగా మారిన జగన్  గొప్పగా ఆలోచించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని... ఈ విషయం కేసీఆర్ కు  కనిపించడం లేదా అనే ఎంపీvenkat REDDY' target='_blank' title=' కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. 

 

 

 

 

 

 అయితే పదేళ్ల కింద చనిపోయిన వైయస్సార్... ఈ లోకంలో లేకపోయినప్పటికీ ఆయన కీర్తి  తో ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారని... కాని  తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన కూతురిని ఎంపీ గా గెలిపోయించుకోలేక పోయారని అన్నారు. జగన్ కు మంచి పేరు ఉందని... కేసీఆర్ లాంటి వాళ్ళతో దోస్తీ చేసి తన పేరును చెడగొట్టుకోవద్దని  ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపాలని అన్నారు. అయితే ఆర్టీసీ  కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని పోరాడి న్యాయం సంపాదించుకుందామనిvenkat REDDY' target='_blank' title=' కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: