రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ పాల‌న‌కు రాష్ట్రంలోని అన్న‌దాత‌లు ముగ్దుల‌వుతున్నారు. జ‌గ‌న్ పాల‌న‌కు జ‌యోస్తు.. అంటూ నిన‌దిస్తున్నారు. గ‌డిచిన ఐదేళ్ల‌లో తాము ప‌డ్డ క‌ష్టాలు తీరుతాయ‌నే ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. తాజా గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వైఎస్సార్ రైతు భరోసా ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని 54 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూర్చాల‌నే ప్ర‌ధాన సంక‌ల్పంతో జ‌గ‌న్ ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మానికి అన్న‌దాత‌లు ఫిదా అవుతున్నారు.


నిజానికి ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఇచ్చిన హామీ మేర‌కు ఈ ప‌థ‌కాన్ని కేవ‌లం 5 ఎక‌రాల‌లోపు ఉన్న వారికి మాత్ర‌మే అప్ల‌యి చేయా ల్సి ఉంది. అయితే, రాష్ట్రంలోని రైతుల క‌ష్టాల‌ను గుర్తించిన జ‌గ‌న్‌.. ఈ ప‌థ‌కాన్ని అంద‌రికీ వ‌ర్తింప‌జేయ‌డంతోపాటు ఆదిలో అనుకున్న 12,500 రూపాయ‌ల‌కు తోడుగా మ‌రో వెయ్యి రూపాయ‌లు జోడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనంద డోలిక ల్లో తేలి యాడుతున్నార‌న‌డంలో సందేహం లేదు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించాల‌ని అనుకున్నా.. వీలు కుద‌ర‌క‌పోవ‌డంతో మంగ‌ళ‌వారం నెల్లూరు కేంద్రంగా సీఎం జ‌గ‌న్ దీనిని ప్రారంభించారు.


ఈ సంద‌ర్భంగా మా ట్లాడిన జ‌గ‌న్‌.. రాష్ట్రానికి ద‌శ దిశ నిర్ణ‌యించేంది రైతులేన‌ని చెప్పుకొచ్చారు. ‘అభివృద్ది అంటే జీడీపీ లెక్కలు మాత్రమే కాదు.. రైతు కుటుంబం బాగుండడాన్నే అభివృద్దిగా భావిస్తాను.  రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్దిలో ప్రయాణిస్తున్నట్టు నేను నమ్ముతాను. రైతుకు భరోసా ఉంటేనే.. రాష్ట్రానికి కూడా భరోసా ఉంటుంది. నిన్నటి కన్నా ఈ రోజు మన పరిస్థితి మెరుగ్గా ఉంటేనే అభివృద్ది చెందినట్లు’అని జగన్ పేర్కొన్నారు.
ఇచ్చిన హామీకి మరిన్ని మెరుగులు దిద్ది అమలు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.


ప్రతీ మండలంలో కోల్డ్‌ స్టోరేజ్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నా పాదయాత్రలో రైతుల కష్టాలను చూశాను. సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు లేక రైతులు పడ్డ ఇబ్బందులను నా కళ్లారా చూశాను. బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ అరకొరగా ఇచ్చిన పరిస్థితులను నెలకొనడం పరిశీలించాను. అందుకే నేడు ఈ రైతుల దుస్థితిని త‌రిమి కొట్టేందుకు ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కాన్ని త‌లకెత్తుకున్నామ‌ని జ‌గ‌న్ వివ‌రించారు. మొత్తంగా చూసుకుంటే.. ఈ ప‌థ‌కం నిజంగా జ‌గ‌న్ పాల‌న‌లో ఒక పెద్ద‌మైలు రాయిగా మిగిలిపోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: