కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొని కొత్త జరిమానాలు అమలు చేసింది. ఈ  కొత్త ట్రాఫిక్ జరిమాణాలతో  వాహనదారుల గుండెలు గుభేల్ మన్నాయి . గీత  దాటితే  వాత పడుతుందేమోనని వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలువురు వాహనదారులు ట్రాఫిక్ చలాన్లతో  జేబులకు చిల్లు పడేలా చేసుకున్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, రాంగ్ రూట్లో వెళ్లడం, ఓవర్ స్పీడ్ వెళ్ళడం ఇలా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఏదైనా ఉల్లంఘనకు  పడిన జరిమానా  మాత్రం జేబుకు చిల్లు పెడుతుంది. అయితే కేంద్రం కొత్త ట్రాఫిక్ జరిమానాలు తెచ్చినప్పటినుంచీ పోలీసులు కూడా బాగా చురుకుగా పనిచేస్తున్నారు. 

 

 

 

 

 

 అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జరిమానాలు  కొన్ని కొన్ని రాష్ట్రాలు తమ తమ రాష్ట్రాల పరిధిలో సవరించుకొని అమలు చేస్తున్నాయి. అయితే  ట్రాఫిక్ చలానా తో బెంబేలెత్తించే  ట్రాఫిక్ పోలీసులు... ప్రస్తుతం వాహనదారుల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం  వాహనాలకు తీపికబురు లాంటిదనే చెప్పాలి.  గత ఆగస్టు నెల  నుంచి అక్టోబర్ 10 వరకు వాహనదారులపై విధించిన సుమారు లక్షన్నర చలాన్ లను  మాఫీ చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ ఓన్లీ ఢిల్లీ వాసులకు మాత్రమే. గత ఆగస్టు నుంచి అక్టోబర్ 10 వరకు నేషనల్ హైవే 24 పై అతివేగంగా వెళ్లిన వాహనదారులకు వేసిన జరిమానాలు  ఉపసంహరించుకుంటున్నట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. 

 

 

 

 

 అయితే జాతీయ రహదారి 24 పై స్పీడ్ లిమిట్  గంటకి 70 కిలోమీటర్లు ఉంటే... గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన వాహనదారులు కూడా చలాన్లు విధించారు అక్కడ ట్రాఫిక్ పోలీసులు. అయితే వాహనదారుల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు రావడంతో వాహనదారులకు విధించిన జరిమాణాలను  వెనక్కి తీసుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: