చాలా ఏళ్ల తరువాత చంద్రబాబు నిజం చెప్పారని రాష్ట్ర ఇరిగేషన్‌ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఆయన దరిద్రం వల్లే ఇన్నాళ్లు నిండలేదన్నారు. ఆయన సీఎంగా దిగిపోగానే జలాశయాలు నిండాయని చెప్పారు. మంగళవారం నెల్లూరులో జరిగిన రైతు భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తరువాత నెల్లూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇచ్చింది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. తనను ఎమ్మెల్యేగా, జిల్లాలో బీసీ మంత్రిగా చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఇంతకంటే తనకేమి అవసరం లేదన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నా జన్మ ధన్యమైందనే చెప్పాలని  ఇరిగేషన్‌ మంత్రి  పేర్కొన్నారు. జీవింతాంతం జగనన్న అనుచరుడిగా ఉంటానని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. మన జిల్లాలో వైయస్‌ఆర్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.



రాష్ట్రంలో రైతులకు సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైందని చెప్పారు. నాడు పాదయాత్రలో రైతులకు నాలుగేళ్ల పాటు ఏటా రూ,12,500 ఇస్తామని చెప్పారన్నారు.  అంతడితో సంతృప్తి చెందని మన నేత .. ఇవాళ దానికి మరో వెయ్యి పెంచి ఇస్తున్నారని తెలిపారు. ఏ చర్యతో అయన  తండ్రికి తగ్గ తనయుడని మరోసారి నిరూపించుకున్నారని చెప్పారు. మనసున్న రాజు ఉంటే ఆ భగవంతుడు సైతం కరుగుతాడని నానుడి ఉందన్నారు. ఈ రోజు రాష్ట్రంలోని జలాశయాలన్నీ కూడా నీటితో కళకళలాడుతున్నాయని చెప్పడానికి చాలా గర్వాంగా ఉందన్నారు. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ పాలన తరువాత మరోసారి పులిచింతల, సోమశీల వంటి ప్రాజెక్టులు నీటితో నిండాయని చెప్పారు. 75 టీఎంసీల నీటిని నిల్వ చేసింది ఈ ఏడాదినేనని తెలిపారు. నిన్న చంద్రబాబు ఇక్కడికి వచ్చి తన వల్లే జలాశయాలు నిండాయని మంత్రి చెప్పారు. 



ఇవాళ వైయస్‌ జగన్‌ జిల్లాలో అడుగుపెట్టగానే వర్షం కురిసి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కి సాదర స్వాగతం పలికినట్టయిందని అన్నారు. నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో, నా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో కానీ.. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ జిల్లాలో ఏ బీసీకి మంత్రి పదవి ఇవ్వలేదు. 50 ఏళ్ల తరువాత మన సీఎం వైయస్‌ జగన్‌ నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఇంతకన్న నా జన్మకు ఏం కావాలి. నా తండ్రి పైనున్నారు. నా తల్లి ఇక్కడే ఉంది. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు జగనన్నకు సైనికుడిగానే ఉంటానన్నారు. ఆ భగవంతుడు మరో జన్మ ఇస్తే నా భగవంతుడికి సైనికుడిగా ఉంటాను. నన్ను ఎమ్మెల్యే చేశారు..మంత్రిని చేశారు. ఇంతకంటే ఇంకా ఏం కావాలి. ఆయన అనుచరుడిగానే ఉంటాను. ఈ జిల్లాలో  ప్రతి ఎకరాకు సాగునీరు అందించబోతున్నారు. ఇంకా 25 ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. ఎవరు ఎన్ని గింజుకున్నా వేరే వారికి అవకాశం లేదన్నారు. నా జన్మంతా జగన్నన్నకే సేవకుడిగా ఉంటానని  చెప్పడానికే  ఎంతో సంతోషంగా ఉందన్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: