అవినీతి...దీని గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే ఉంది. అసలు అవినీతికి మనదేశం పెట్టింది పేరైపోయింది. ప్రతి ప్రభుత్వంలో ఈ అవినీతి కొనసాగుతూనే ఉంది. అయితే అవినీతి విషయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుని కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నాయి. కానీ దీనిని పూర్తి లేకుండా చేయడం మాత్రం కష్టమైపోతుంది. ఇక ఈ అవినీతి విషయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా టాప్ లోనే ఉంది. గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ అవినీతి తారస్థాయికి కూడా చేరుకుంది.


అందుకే మొన్న ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. వైసీపీ భారీ మెజారిటీతో గెలిచి జగన్ సీఎం అయ్యారు. అయితే జగన్ ఎన్నికల ముందు ప్రజలకు పలు హామీలు ఇస్తూనే...అవినీతి విషయంలో కూడా గట్టి ప్రకటనలే చేశారు. అవినీతిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటానని మాట ఇచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు...గత టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


అందులో భాగంగా గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వల్ల జరిగిన అక్రమాలని బయటపెడుతూ, ఆ నిర్ణయాలని రద్దు చేస్తున్నారు. అందుకే పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు. విద్యుత్ పీపీఏలు పునః సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. అటు అమరావతి నిర్మాణంలో టీడీపీ చేసిన అక్రమాలు బయటపెట్టేందుకు నిర్మాణ పనులని ఆపేశారు. అలాగే మొదట్లో ఇసుక తవ్వకాలు ఆపి, కొత్త పాలసీని రూపొందించి ఇసుకని అందిస్తున్నారు. ఇలా టీడీపీ తీసుకున్న చాలా నిర్ణయాలని జగన్ మళ్ళీ సమీక్షిస్తున్నారు.


అయితే టీడీపీ అవినీతిని పక్కనబెడితే ఈ ఐదు నెలల్లో ప్రవేశ పెట్టిన పథకాలలో గానీ, నిర్ణయాల్లో గానీ జగన్ ఎలాంటి అవినీతి చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించారు. ప్రతి విషయంలో పారదర్శకంగా పని చేస్తూ ముందుకెళ్లారు. ఇక ప్రతిపక్ష టీడీపీ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై విమర్శలు చేసినా, అవినీతి విషయంలో మాత్రం కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోయారు. టీడీపీ సంగతి వదిలేస్తే ఈ ఐదు నెలల్లో జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఎక్కడ అవినీతి గురించి చర్చ చేయలేదు. మొత్తానికి పరిశీలిస్తే జగన్ ప్రభుత్వంలో అవినీతి అనే పదం వినబడటం తగ్గిందనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: