తెలంగాణలో ఈ నెల 5న ప్రారంభం అయినా  ఆర్టీసీ సమ్మె నేటితో 11 వ  రోజుకి  చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల  డిమాండ్లపై సరైన పరిష్కారం చూపలేదు . ఓవైపు ఆర్టీసీ బస్సులు నడక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ...  ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టంది  కానీ ఆర్టీసీ కార్మికుల డిమాండ్ ల  పరిష్కారంపై మాత్రం చొరవ చూపలేదు. అంతేకాకుండా ఆర్టీసీ సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గత నెల జీతాలు కూడా కార్మికులకు చెల్లించలేదు ప్రభుత్వం. దీంతో మనస్తాపం చెందిన కార్మికులు ఆత్మహత్యాయత్నానికి  పాల్పడుతున్నారు. 

 

 

 

 

 తమ ఆత్మ బలిదానాలతో  అయినా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందని భావిస్తూ ప్రాణాలు అర్పిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. అయితే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన బిజెపి,  కాంగ్రెస్, సిపిఐ,సిపిఎం ల మద్దతు కూడగట్టుకుంది ఆర్టీసీ సమ్మె. ఇక సమ్మెకు మద్దతు తెలుపుతున్న పార్టీలన్నీ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నాయి . ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదని ధ్వజమెత్తుతున్నాయి . పక్క రాష్ట్ర సీఎం అయిన జగన్ ను  చూసైనా కేసీఆర్ తన తీరు మార్చుకోవాలని ఘాటు విమర్శలు చేస్తున్నారు. 

 

 

 

 

 అయితే ఆర్టీసీ సమ్మెను  తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ముందుండి నడిపిస్తున్నారు. అయితే మొదట ఆర్టీసీ జేఏసీ  టీఎన్జీవో సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు  ఆలోచించగా...  ముందే ఊహించిన కేసీఆర్ టీఎన్జీవో సంఘాలను గెలిపించి తమకు పలు హామీలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ కేసీఆర్ వ్యూహం మాత్రం ఫలించలేదు. తాజాగా టీఎన్జీవో ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి. ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని టీఎన్జీవో తీర్మానం చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా తమకు మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని టిఎస్ ఆర్టిసి నేత అశ్వద్ధామ రెడ్డి అన్నారు. తామే  ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపాలని కోరినట్లు ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, టీఎన్జీవో సంఘాలు, ఉద్యమ సంఘాలు, విద్యార్థులు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపారు. ఇదంతా చూస్తుంటే సకల జనుల సమ్మె రీతిలో ఆర్టీసీ సమ్మె ఉధృతం చేసేందుకు టిఎస్ఆర్టిసి జేఏసీ  భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: