ఏపీలో ఇప్పుడు ఎక్క‌డ చూసిన వైసీపీ ప్ర‌భంజనం జోరుగా క‌నిపిస్తుంది. ఎన్నిక‌ల్లో ఫ్యాన్ గాలి దాటికి చంద్రాలు సైకిల్ తుక్కుతుక్కు అయింది. ఇక అదే జోరుతో పరిపాల‌నను ముందుకు సాగిస్తున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్‌. ప్ర‌తిప‌క్షాల‌కు ఎక్క‌డైనా ఇసుమంతైనా విమ‌ర్శించే సందు లేకుండా జ‌గ‌న్ అనేక సంక్షేమ ప‌థ‌కాల‌తో ముందుకు సాగుతుంటే.. ప్ర‌తిప‌క్షాల‌కు రంద్రాన్వేష‌ణ కోసం ఎంతో క‌స‌ర‌త్తు చేయాల్సి వ‌స్తుంది. అయితే ఇప్పుడు ఏపీలో జ‌గ‌న్ వారంలో రెండు మూడు సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతూ ప్ర‌జాసంక్షేమ‌మే ధ్యేయంగా ప‌ని చేసుకుంటూ పోతున్నారు.


ప్ర‌తిప‌క్ష పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు అధికార పార్టీని విమ‌ర్శించాలి అనే ఆలోచ‌న‌తో  ఏదో విమ‌ర్శించామా అంటే విమ‌ర్శించాం.. అని చేతులు దులుపుకుంటున్నాయి త‌ప్పితే.. అస‌లు విమ‌ర్శించే అవ‌కాశ‌మే లేకుండా జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ చేప‌డుతున్న ప‌థ‌కాలు చూస్తుంటే ఏపీలో అస‌లు ప్ర‌తిప‌క్షాలు బ‌తికి బ‌ట్ట క‌ట్టేనా అనిపిస్తుంది. సీఎం జ‌గ‌న్ చేస్తున్న ఈ ప‌థ‌కాల‌తో ప్ర‌తిప‌క్షాలు నోరుమూసుకుని చూస్తుండే ప‌రిస్థితి తీసుకొస్తున్నాడు. ఏమైనా  విమర్శిస్తే ప్ర‌జ‌ల నుంచి ఎక్క‌డ వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌నే భ‌యంతోనే బిక్కుబిక్కుమంటూ గ‌డిపే గ‌డ్డు రోజులు వ‌స్తున్నాయి.


ఇక సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే ఏపీలోని అన్ని వర్గాల ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసుకుంటూ వ‌స్తున్నారు. అన్ని వ‌ర్గాల‌కు త‌న‌వైపుకు లాక్కునే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ బాగానే స‌క్సెస్ అయ్యాడంటే అశ్చ‌ర్యం క‌లుగ‌క‌మాన‌దు. ఏపీలోని అన్ని వాహ‌న‌దారుల‌ను త‌న ప‌థ‌కంలో త‌న‌వైపు తిప్పుకున్నారు. రైతుల‌ను రైతు భ‌రోసాతో వారినంద‌రిని త‌న‌వైపుకు తిప్పుకున్నారు. ఇక కంటి వెలుగు, ఆరోగ్య శ్రీ ప‌థ‌కంతో  అంటూ ఏపీలోని ఇంటింటికి వైద్యం అందిచే బృహ‌త్త‌ర ప్రణాళిక ను రూపొందించారు.


ఇక బ‌డిపిల్ల‌ల‌ను ఇప్ప‌టి నుంచే వారిని త‌న‌కు ఓటర్లుగా మార్చుకునే ఎత్తుగ‌డ‌లు జ‌గ‌న్ వేశాడంటే ముందు చూపు ఎంత‌గా ఉందో చూస్తే ప్ర‌తిప‌క్షాల‌కు దిమ్మ తిరగాల్సిందే. ఇక ఇప్పుడు న‌వంబ‌ర్ లో మ‌రో ప‌థ‌కం ను సీఎం జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నార‌ట‌.. ఆ ప‌థ‌కం క‌నుక ప్ర‌వేశ పెడితే ఇక ప్ర‌తిప‌క్షాలు ఇంటి బాట ప‌ట్టాల్సిందేన‌ట‌.. అంత‌క‌న్నా ముఖ్యంగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్రాలుకు మాత్రం ఇక భ‌విష్య‌త్‌తో ఆ ప్ర‌తిప‌క్ష హోదా కూడా దొరుకుతుందో లేదో వేచి చూడాల్సిందేన‌ట‌.


న‌వంబ‌ర్ 14న సీఎం జ‌గ‌న్ నాడు నేడు అనే ప‌థ‌కాన్ని ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ఆ ప‌థ‌కం ఉద్దేశం ఏంటంటే.. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు పాఠ‌శాల‌ల్లో ఉన్న ప‌రిస్థితులను ఫోటోలు తీసి వాటిని భ‌ద్ర‌ప‌రిచి.. ఐదేండ్ల ప‌రిపాల‌న త‌రువాత దాని ప‌రిస్థితి ఎలా అయిందో మ‌ళ్ళీ ఫోటోలు తీసి ప్ర‌జా తీర్పు కోసం వాటిని ప్ర‌ద‌ర్శించే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌ట‌. అలా చేస్తే జ‌గ‌న్‌కు జ‌నాల్లో సానుభూతి, ఎన్నిక‌ల్లో ఓట్ల‌కు ఓట్లు.. సీట్ల‌కు సీట్లు.. ప్ర‌తిప‌క్షాల‌కు ఓట్లు నిల్.. సీట్లు నిల్ అని ఏపీ ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: