2016లో నల్లధనాన్ని అరికట్టేస్తా.. అందుకే నోట్లను రద్దు చేస్తున్న అని మోదీ ఓ సంచలన ప్రకటన ఇచ్చాడు. ప్రకటన ఇచ్చినట్టే పాత 500 నోట్లను, వెయ్యి రూపాయిల నోట్లను బ్యాన్ చేసి వాటి స్థానాల్లో కొత్త 500 నోట్లు, 2000 నోట్లు తీసుకొచ్చి పెట్టాడు. అయితే ఏమైంది అవినీతి బయట పడిందా అంటే లేదు ? 


దాని వల్ల ఎవరికైనా లాభం వచ్చిందా అంటే లేదు.. కానీ దాని వల్ల సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. వెయ్యి రూపాయిలు మార్చాలంటే ఒక్క రోజంతా వెయిట్ చెయ్యాల్సి వచ్చేది. ఇంకా ఏటీఎం దగ్గర అయితే కుప్పలు కుప్పలు ఉండేవారు. నెల జీతం పడింది తీసుకోవాలన్న రోజంతా వెయిట్ చెయ్యాల్సి వచ్చేది. 


కానీ ఒక్క నల్ల దానువంతుడు బయట పడలేదు. నల్లధనం పోగేసుకున్న వారంతా బ్యాంకుల వారికీ డబ్బు ఇచ్చి మార్చుకున్నారు. ప్రజలు మాత్రం పిచ్చి వాళ్ళల బ్యాంకుల చుట్టూ, ఎటిఎంల చుట్టూ తిరిగారు. ఏమైతేనేం ఒక నాలుగు నెల్ల తర్వాత ఆ సమస్య తీరిపోయింది. ఇది అంత ఎందుకు వచ్చింది అంటే రూ. 2000 నోటు వల్ల. 


అలాంటి ఈ రూ. 2000 నోటుని ఇప్పుడు బ్యాన్ చెయ్యాలని ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుందట. ఈ రెండు వేల నోట్ల రద్దుపై ప్రముఖ ఎకనమిస్ట్ నితిన్ దేశాయ్ మాట్లాడుతూ.. ''పెద్ద నోట్లను ఆపడం వల్ల బ్లాక్‌మనీ లావాదేవీలకు ఇబ్బంది కలుగుతుంది. కానీ నోట్ల రద్దుతో పోలీస్తే ఈ చర్య ఒక రకంగా చాలా మంచిదే. చాలా యూరోపియన్ దేశాల్లో నల్లధనానికి బ్రేక్ వేసేందుకు ఇలా పెద్ద నోట్లను అప్పుడప్పుడు రద్దు చేస్తుంటారు'' అని పేర్కొన్నారు. 


అయితే మరికొద్ది కాలంలో రెండువేల నోట్లు కనిపించకుండా పోతాయి అని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రణ చెయ్యలేదని ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా తెలిసింది. ఇకముందు ఈ రెండు వేల నోటు ముద్రణ కాదని వారు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే త్వరలో రెండు వేల నోటు రద్దు అవుతుందని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: