తగినంత బడ్జెట్‌ లేని కారణంగానే 25వేలమందిని ప్రభుత్వ విధుల నుంచి తొలిగించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బడ్జెట్ లేదన్న కారణంతో దీపావళి పండుగకు కొద్దిరోజుల ముందు ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 25వేలమంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ...యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.


 ఆగస్ట్ 28న సీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో  రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూపీ పోలీస్ డిపార్ట్‌మెంట్ హోంగార్డుల తొలగింపుపై తుది నిర్ణయం తీసుకుంది. 25వేలమందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనం రేపుతోంది. తగినంత బడ్జెట్‌ లేని కారణంగానే ఈ 25వేలమందిని విధుల నుంచి తొలిగించినట్లు చెబుతున్నారు.
 ఉత్తరప్రదేశ్‌లో హోంగార్డులకు సమానంగా పోలీస్‌ కానిస్టేబుళ్లకు వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిందట.


 గతంలో రోజుకు రూ.500లు హోంగార్డులకు జీతంగా చెల్లించేవాళ్లు.  ఐతే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ వేతనాన్ని రూ.672ల పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.  బడ్జెట్‌ పరిమితంగా ఉందని.. అందుకే 25వేల మందిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు అధికారులు. మరో 99వేల మంది హోంగార్డులు ఇకపై నెలలో 25 రోజులకు బదులుగా 15 రోజులు మాత్రమే విధులకు రావాలని సూచించింది. కేవలం 15 రోజులు మాత్రమే ఉపాధి కల్పిస్తామని పేర్కొంది.

బడ్జెట్ కారణంగానే ఇంతమందిని తొలగించామని ప్రభుత్వం చెబుతున్నా.. ఇలా ఒక్కసారిగా 25వేలమందిని తప్పించడం సరికాదని ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అక్టోబరు 11న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో 25వేల మంది ఉద్యోగాలను కోల్పోయి ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చిన బీజేపీ.. ఇప్పుడేమో ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నదని విమర్శిస్తున్నారు. ఉద్యోగాలు తొలగిస్తే.. హోంగార్డుల కుటుంబాలు రోడ్డున పడతాయని.. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.  ఇటు యోగి సర్కార్ నిర్ణయంతో హోంగార్డులు కూడా షాక్‌లో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: