బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదులకు పుట్టినిల్లు అయిన పాకిస్థాన్ త‌న‌ను తాను ప్ర‌చారం చేసుకుంటున్న తీరు చూసి నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. అదే స‌మ‌యంలో పాక్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, కేంబ్రిడ్జ్ యువరాణి కేట్ మిడిల్టన్ 5రోజుల పర్యటనకోసం పాకిస్థాన్ కు వెళ్లారు. ఇస్లామాబాద్ ఎయిర్ పోర్టులో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. రాయల్ కపుల్‌కు వెల్కమ్ చెప్పారు. ఇదే సందర్భాన్ని ట్విట్టర్లో ఆ దేశ సమాచార శాఖ ``శాంతియుత నేల అయిన పాకిస్థాన్ గడ్డపైనుంచి… మేం రాయల్ కపుల్ కు స్వాగతం చెబుతున్నాం.” అని అప్ డేట్ చేసింది. 


శాంతియుత దేశం(Land Of Peace) అని పాక్ కామెంట్ చేయ‌డం చూసి...నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. పాకిస్థాన్ అనగానే పేలుళ్లకు మారుపేరు....తీవ్ర‌వాదుల‌ అడ్డా అనే అంటారని అయితే...ఆ దేశం ఆ మాట ఒప్పుకోకపోయినా ఫర్వాలేదు కానీ… అతిశయోక్తి ఎందుక‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. పీస్(Peace) అంటే ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ తప్పు ఇచ్చారని.. ముక్కలు(piece) ముక్కలు చేసే దేశం అది అని మరొకరు కామెంట్ చేశారు. 


ఇదిలాఉండ‌గా, ప్రిన్స్ దంప‌తుల ప‌ర్య‌ట‌న రోజే...పాకిస్థాన్లోని క్వెట్టాలో మరో పేలుడు జరిగింది. క్వెట్టాలో రద్దీగా ఉన్న ఓ రోడ్డుపై పోలీస్ వాహనాన్ని టార్గెట్ చేస్తూ బ్లాస్టింగ్ జరిగింది. భారీ శబ్దంతో పేలుడు జరిగేసరికి.. జనం భయంతో పరుగులుపెట్టారు. ఖలీల్ అహ్మద్ అనే పోలీస్  అక్కడికక్కడే చనిపోయాడు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిని వెంటనే క్వెట్టా సివిల్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేసినట్టు బెలూచిస్థాన్ హోంమంత్రి జియల్లా లాంగో చెప్పారు. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందిస్తామన్నారు. బ్లాస్టింగ్ తో క్వెట్టా సహా ప్రధాన నగరాల్లో బందోబస్తు పెంచారు. ఇలాంటి రోజే...పాక్ అధికారులు చేసిన ట్వీట్ స‌హ‌జంగానే...నెటిజ‌న్ల‌కు న‌వ్వులు తెప్పించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: