రాజకీయాల్లో శాశ్వత శత్రువులు , శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని నిజం చేస్తూ,  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ జన్మదిన వేడుకల్లో , తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పాల్గొనడం హాట్ టాఫిక్ గా మారింది . టీడీపీ శాసనసభ్యులు, పక్క పార్టీల వైపు తొంగిచూస్తున్నారన్న ఊహాగానాలు విన్పిస్తున్న నేపధ్యం లో , ఆ ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎంపీ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం కూడా అందులో భాగమేనా? అన్న అనుమానాలు లేకపోలేదు .


ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో అదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కారణం బలరాం పాల్గొనడం , ఆ పార్టీ వర్గాలను  విస్మయానికి   గురి చేసింది .  మాగుంట  జన్మదిన వేడుకల్లో  కరుణం బలరాం ఒక్కరే కాకుండా తన కుమారునితో కలిసి హాజరుకావడం చూస్తుంటే , ఆయన అధికార పార్టీ వైపు చూస్తున్నారేమోనన్న అనుమానాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . రాష్ట్రం లో అధికార వైస్సార్ కాంగ్రెస్ , ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మధ్య  ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఉప్పు , నిప్పు అన్నట్లు ఉన్న తరుణం లో కరుణం తన కుమారుడి తో కలిసి అధికార పార్టీ ఎంపీ జన్మదిన వేడుకల్లో పాల్గొనడాన్ని ఎలా సమర్ధించుకోవాలో తెలియక తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు .


 ఎన్నికల కు ముందే కరుణం బలరాం టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టారని, ఒకదశ లో పార్టీ టికెట్ దక్కకపోతే వైస్సార్ కాంగ్రెస్ లో చేరాలని భావించారన్న వాదనలు సైతం లేకపోలేదు . ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత పలువురు ఎమ్మెల్యేలు కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ వైపు , రాష్ట్రం లో ఉన్న వైస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ఉహాగానాలు విన్పిస్తున్న నేపధ్యం లో కరుణం బలరాం , మాగుంట జన్మదిన వేడుకల్లో పాల్గొనడాన్ని టీడీపీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: