తెలంగాణాలో గత కొన్ని రోజులుగా పరిస్థితులు బాగాలేవు. చెప్పాలంటే గత పన్నెడు రోజులుగా ఆర్టీసీ సమ్మెతో ఎక్కడికక్కడ జీవనం స్థంభించింది. ఉద్రిక్తల మధ్య తెలంగాణా జీవనం సాగుతోంది. ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. పరిస్థితి చేయి దాటేలా కనిపిసోంది. ఇక సకల జనుల సమ్మె కనుక ఆరంభమైతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం.


ఇదిలా ఉండగా తెలంగాణా పరిస్థితులను స్వయంగా తెలుసుకోవడానికి రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై ని ఢిల్లీకి అర్జంట్ గా ఈ రోజు కేంద్రం పిలిపించుకోవడం చర్చనీయాంశంగా  ఉంది. హఠాత్తుగా ఈ రోజు తమిళ్  సై ఢిల్లీ వెళ్ళడం, ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాని కలుసుకోడంతో  కేంద్రంతో గవర్నర్ భేటీపై పెద్ద ఎత్తున వూహాగానాలు చెలరేగుతున్నాయి.


ఏం చెప్పిఉంటారన్న హాట్ హాట్ చర్చ కూడా సాగుతోంది. తమిళ్ సై తో సుదీర్ఘంగా ఢిల్లీ పెద్దలు చర్చలు జరపడంతో కేసీయార్ సర్కార్ తీరుపట్ల కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ అంతటా వినిపిస్తోంది. ఒకరు ఇద్దరు కాదు, యాభై వేల ఆర్టీసీ కార్మికుల సమస్య ఇది. వారి కుటుంబాలు ఉన్నాయి. అందరికీ ఒక్కసారిగా డిస్మిస్ చేసి కేసీయార్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారన్న మాటల మధ్యన ఏం జరుగుతుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.


దీంతో తమిళ్ సై భేటీ తరువాత కేంద్రం ఆర్టీసీ సమ్మె విషయంలో కెసీయార్ సర్కార్ కి ఏమైనా చెబుతుందా, శాంతిభద్రతల విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుందా అన్నది కూడా చూడాలని అంటున్నారు. మొత్తానికి తమిళ్  సై ఢిల్లీ పర్యటన మాత్రం ఆసక్తికరంగా ఉందంటున్నారు. మరి కేంద్రం తరువాత స్టెప్ ఏంటన్నది ఇపుడు అంతా చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: