రాష్ట్రం లో పరిస్థితులు చేజారిపోతున్నాయా? అంటే అవుననే  గవర్నర్ తమిళిసై, ప్రధాని , హోం శాఖ మంత్రి  నివేదించినట్లు తెలుస్తోంది . ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యం లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హస్తిన ప్రయాణం హాట్ టాఫిక్ గా మారింది . ఇక తమిళిసై ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు . రాష్ట్రం లోని ప్రస్తుత పరిస్థితులను  ప్రధాని , హోం శాఖ మంత్రి కి ఆమె  నివేదించారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన  డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ,  ఈ నెల ఐదవ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేపడుతున్న విషయం తెల్సిందే .


 సమ్మె కు వెళ్లిన కార్మికులను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది .   సమ్మె కు వెళ్లిన కార్మికులతో చర్చలు జరపకుండా,  రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడాన్ని  నిరసిస్తూ ,  ఇప్పటికే ఖమ్మం డిపో కు చెందిన డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మబలిదానం చేసుకోగా , మరొక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఆర్టీసీ సమ్మె చేపట్టిన అనంతరం ప్రభుత్వ వైఖరి తో  ఇద్దరు  డ్రైవర్లు తీవ్ర మానసిక ఒత్తిడితో గుండెపోటు తో మృతి చెందారు.


 అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు  సిద్ధంగా లేకపోవడం... తెలంగాణ లో అసలు ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని భావించిన హస్తిన పెద్దలు , గవర్నర్ ను పిలిపించుకుని ఆరా తీసినట్లు తెలుస్తోంది . ఈ నెల 20 వ తేదీన హస్తిన కు వెళ్లాల్సిన గవర్నర్ ను ముందుగానే పిలిపించుకుని , ప్రధాని , హోం శాఖ మంత్రి ప్రత్యేకంగా చర్చించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మారింది .


మరింత సమాచారం తెలుసుకోండి: