ట్రంప్ ఎప్పుడైతే సిరియాలోని ఉత్తరప్రాంతం నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నారో అప్పటి నుంచి మళ్ళీ అక్కడ అరాచకం మొదలైంది.  సరిహద్దు దేశమైన టర్కీ.. ఉత్తరప్రాంతంపై బాంబుదాడులు చేసింది.  ఈ దాడులతో సరిహద్దుల్లో ఉన్న కుర్దు ప్రజలు మరణిస్తున్నారు.  దీనిని అంతర్జాతీయ సమాజం సైతం వ్యతిరేకిస్తోంది.  టర్కీ ఈ ప్రాంతంలో బాంబుదాడులు  చేయడానికి కారణం ఉన్నది.  టర్కీ ప్రాబల్యంతో ఐసిస్ ఉగ్రవాదులు సిరియాలో పుట్టుకొచ్చారు.  


టర్కీ అండతోనే వారు సిరియాలోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు.  దీంతో కుర్దులు వారిపై పోరాటం చేయడం మొదలుపెట్టారు.  మొదట్లో సిరియా ప్రభుత్వానికి, కుర్దులకు పడేదికాదు.  కుర్దులు సొంతంగా కుర్దిస్తాన్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నారు.  వారి పోరాటం మధ్యలోకి ఐసిస్ తీవ్రవాదులు చొరబడి భీభత్సం చేయడంతో పాటు చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు.  


దీంతో సిరియా సైన్యం, కుర్దులు ఐసిస్ పై పోరాటం చేయడం మొదలుపెట్టాయి.  అమెరికా సైన్యం సిరియాలో ఐసిస్ తీవ్రవాదులపై పోరాటం చేసేందుకు  కుర్దుల సహాయంతో ఐసిస్ ఆక్రమించుకున్న ప్రాంతాలకు ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంది.  అయితే, సడెన్ గా అమెరికా బలగాలను వెనక్కి తీసుకోవడంతో టర్కీ మరలా రెచ్చిపోయి దాడులను చేయడం మొదలుపెట్టింది.  ఈ దాడులలో అమాయకమైన కుర్దులు మరణిస్తున్నారు.  


సిరియా సైన్యం కుర్దులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది.  మరోవైపు సిరియా అధ్యక్షుడు రష్యా సహాయం కోరారు.  గతంలో కూడా సిరియాకు రష్యా సహాయం చేసింది.  రష్యా సహాయంతోనే అధ్యక్షుడు తన పదవిని సుస్థిరం చేసుకున్నాడు.  కాగా, ఇప్పుడు మరోసారి రష్యా సహాయం చేసేందుకు సిద్ధం కావడంతో అమెరికా ప్రాభల్యం తగ్గిపోయింది.  గల్ఫ్ ప్రాంతంలో క్రమేణా రష్యా ప్రాబల్యం పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.  ఇదే జరిగితే తిరిగి రష్యా ప్రపంచంలో తిరుగులేని శక్తిగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.    


మరింత సమాచారం తెలుసుకోండి: