యూత్లో మంచి క్రేజ్ ఉన్న స్టార్ అంటే ఎవరో ఇప్పటికే మీకు అర్థమయింది కదా .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. తన యాట్టిట్యూడ్ తో చాలా మంది అభిమానులను పోగేసుకున్నారు ఇకపోతే గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రజలకు నేను సేవచేస్తాను అంటూ సొంతంగా జనసేన పార్టీని స్థాపించి మొదట తాను ఎన్నికల్లో నిలబడక సపోర్ట్ చేసి టీడీపి ని ముందుండి గెలిపించాడు.. ఈ సారి జరిగినా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే.. 


ప్రజలకి ఎదో చేయాలి.. నేను రాజకీయ నాయకుడిగా ఎదగాలని అనుకుంటే సరిపోదు.. అందుకు కావలసిన అనుభవం కూడా ఉండాలని రాజకీయ ప్రముఖులు విమర్శలు గుప్పించారు..మొన్నటి వరకు టీడీపి ని ఎత్తిపొడిచిన పవన్ ఎన్నికల్లో చతికిల పడటంతో వైసిపి పై తన బాణాన్ని సంధించి విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే..


ఎన్నికల్లో జనసేన పార్టీతో పాటుగా టీడీపి కూడా ఓటమి పాలవ్వడంతో పవన్ నోరు అదుపులో పెట్టుకుంటారని వైసీపీ కార్యకత్తలు అనుకున్నా కూడా పవన్ పెడవిరచడం మాత్రం మానలేదు.. రెడ్డి వచ్చే మొదలెట్టు సామెత కు సరిగ్గా న్యాయం చేస్తున్నారు పవన్.. ఇప్పుడు వైసిపి ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నా కూడా పవన్ తీరు మార్చుకోలేదు..


అయిందానికి కానీ దానికి పవన్ కళ్యాణ్ మళ్ళీ వైసిపి నే కారణమంటూ వేలెత్తి చూపిస్తున్నారు.. మరోవిషయమేంటంటే టీడీపీ పై ఉన్న మమకారం తో టీడీపి కి కొమ్ముకాస్తూ వైసీపీకి చుక్కలు చూపించారు. అదే మాదిరిగా ప్రతి చిన్న విషయంలో కూడా టీడీపీని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.. దీన్నిబట్టి పవన్ ఇంకాటీడీపీ మంత్రాన్ని వదలడం లేదని అంటున్నారు.. జరుగుతున్న వాటిని చూస్తే ఎవరైనా కూడా అదే అనేక మానరు..


మరింత సమాచారం తెలుసుకోండి: