టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ. ఈ పేరు టాలీవుడ్ కి పరిచయం అక్కర్లేని పేరు. అటు పెద్దల నుంచి ఇటు కుర్రకారు  వరకు ప్రతి ఒక్కరికి బ్రహ్మాజీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ నాటి సింధూరం నుంచి తాజా సైరా వరకు తనదైన నటనతో  ప్రేక్షకులను మెప్పిస్తూనే  ఉన్నారు. విభిన్న పాత్రలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఒక ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నారు బ్రహ్మాజీ. కామెడీ టైమింగ్ పట్టేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలన్న... సెంటిమెంట్ సీన్లలో జీవించి అందరిని కంటతడి పెట్టించాలన్న అది బ్రహ్మజీ  కి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఏ పాత్ర ఇచ్చినా అందులో బ్రహ్మాజీ తప్ప వేరే వాళ్ళు చేస్తే బాగుంటుందేమో అనేంతగా ఆ పాత్రలో ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఇక ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్ళు  అయినప్పటికీ మొదటి సినిమాలో ఎలా ఉన్నాడో  తాజాగా విడుదలైన సైరా సినిమాలో కూడా అంతే యాంగ్ గా కనిపించాడు బ్రహ్మాజీ  . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా మంది కమెడియన్స్ వచ్చారు పోయారు కానీ బ్రహ్మ మాత్రం తనదైన నటనలో తనదైన ముద్ర వేసుకున్నారు. 

 

 

 

 

 పాత్ర ఏదైనా అందులో జీవించి నటించగల నటన బ్రహ్మాజీ సొంతం.అయితే బ్రహ్మాజీ రిల్ లైఫ్ లో ప్రేమ కథ లో కనిపించింది చాలా తక్కువే కానీ... రియల్ లైఫ్ లో మాత్రం ఆయన ప్రేమ కథ చాలా ఆసక్తిగా ఉంది. అయితే బ్రహ్మాజీ ప్రేమ కథ  తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అయితే బ్రహ్మాజీ పెళ్ళై  కొడుకు ఉన్న శశ్వతిని  అనే మహిళను పెళ్లి చేసుకోవడమే కాకుండా... పిల్లలను కూడా వద్దు అనుకున్నారట. మరి బ్రహ్మశ్రీ ప్రేమ కథ ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. చెన్నై లో ఉన్న సమయంలో శశ్వతిని అనే మహిళతో పరిచయం ఏర్పడిందని. అయితే ఆమెకు ముందే పెళ్ళై  భర్తతో విడాకులు తీసుకొని ఉందని... ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడని బ్రహ్మాజీ తెలిపారు. అయితే ఆమెతో  కొన్నాళ్ళు కలిసి ప్రయాణం చేసిన తర్వాత తాము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పారు. 

 

 

 

 

 అయితే ఇద్దరి అభిప్రాయాలు కలవడం వల్ల పెళ్లి చేసుకున్నామని.. మిగతాది ఆలోచించలేదని బ్రహ్మాజీ తెలిపారు. అయితే పెళ్లి తర్వాత బ్రహ్మాజీ పిల్లలు వద్దు అనుకున్నారట... ఎందుకంటే ఆల్రెడీ తన భార్యకి ఓ కొడుకు ఉండడం... అతను తనకు చిన్నప్పటినుండి  తెలియడం... అంతే కాకుండా మళ్లీ వాళ్ల మధ్య  పిల్లలు పుడితే స్పెషల్ అయిపోతనేమో అని  భావించి పిల్లలు వద్దు అనుకున్నారట  బ్రహ్మాజీ. అయితే తన కొడుకు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని... తాజాగా నక్షత్రం సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడని... ఇక త్వరలో సినిమాలో  హీరోగా నటించబోతున్నాడంటూ చెప్పుకొచ్చారు బ్రహ్మాజీ . ఈ సినిమాలో బ్రహ్మాజీ పోలీస్ పాత్రలో చెప్పుకొచ్చారు బ్రహ్మ హత్య.

మరింత సమాచారం తెలుసుకోండి: