మనిషి జీవనాన్ని, జీవితాన్ని నిర్ణయించేది జీతం.. మంచి సంపాదన.  మనిషికి మంచి సంపాదన ఉంటె.. దానికి తగిన విధంగా జీవితం ఉంటుంది.  జీవన శైలి అలవడుతుంది.  అలా కాకుండా మనిషి జీవనం  అస్తవ్యస్తంగా కుంటుపడే విధంగా ఉంటె.. అతని జీవన శైలి అలానే ఉంటుంది.  జీవితం కూడా గమ్యం లేని నావలా సాగుతుంది.  ఎప్పుడు ఎక్కడ ఎలా మారిపోతుందో చెప్పలేము.  అందుకే మంచి జీవనాన్ని అలవాటు చేసుకోవాలి.  


గ్లోబలైజేషన్ అయ్యాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది.  మనిషి తన జీవనశైలికి తగ్గట్టుగా అనేక ప్రాంతాలకు వలస వేస్తున్నారు.  వలస వెళ్లి అక్కడ తనకు అనుకూలంగా ఉన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.  కాలం అలా గడిచిపోతుంది.  అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి.  డబ్బుకోసం ఎక్కువ మంది దుబాయ్ లో ఉద్యోగాలు చేసేందుకు వెళ్తుంటారు.  అలా వెళ్లిన చాలా మంది చిన్న చిన్న నేరాల చేస్తూ జైలుకు వెళ్తుంటారు.  


జైలు నుంచి తిరిగి బయటకు వచ్చిన వ్యక్తులకు అక్కడ ఉపాధి దొరకడం చాలా కష్టం.  అందుకే జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏదోలా సొంత దేశాలకు వెళ్లేలా ప్రయత్నం చేస్తుంటారు.  వారికి అక్కడి పోలీసులు కూడా సహకరిస్తుంటారు.  అయితే, ఇండియా నుంచి దుబాయ్ వెళ్లి అక్కడ సెటిల్ అయిన జోగిందర్ సింగ్ సలారియా అనే వ్యక్తి అక్కడ వ్యాపారం చేస్తున్నారు.  వ్యాపారంతో పాటుగా పీసీటి పేరుతో స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు.  


ఈ సంస్థకు దుబాయ్ లో మంచి పేరు ఉన్నది.  ప్రతి ఏడాది అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.  దుబాయ్ లోనే కాదు, ఇండియాలోను, అటు పాకిస్తాన్ లోను   కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  అయితే, ఈయన దగ్గరకు దుబాయ్ పోలీసులు 13 మంది ఖైదీలకు సంబంధించిన లిస్ట్ ను పంపించారు.  ఆ ఖైదీలను వారి స్వస్థలాలకు పంపించడానికి కావాల్సిన సహాయం చేయాలని కోరారు.  అందుకు సలారియా ఒకే చెప్పారని దుబాయ్ పోలీసులు చెప్తున్నారు.  పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఉగాండా, చైనా, ఇథియోపియా తదితర దేశాలకు చెందిన ఖైదీలు అందులో ఉన్నారట.  వారిని త్వరలోనే వారి స్వస్థలాలకు పంపించబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: