గవర్నర్ అంటే రాష్ట్రానికి ప్రధమ పౌరుడు అని అర్ధం.  రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాలకు విధిగా ఆయన్ను ఆహ్వానించాలి.  ఆయనతోనే పనులను మొదలుపెట్టారు.  రాజ్యాంగం ప్రకారం ఆయనకు ఇచ్చిన అధికారాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి.  తూచా తప్పకుండా పాటించాలి.  అవసరమైతే విశేషాధికారాలు ఆయనకు ఉన్నాయి.  వాటిని ఉపయోగించి కొన్ని పనులను నిర్వర్తించాల్సి ఉంటుంది.  
 
అయితే, ఇటీవలే బెంగాల్ లో దుర్గాపూజ జరిగింది.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ దుర్గాపూజకు ఆ రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ధన్కర్ హాజరయ్యారు.  దాదాపు నాలుగు గంటలు అయన అక్కడే ఉన్నారు.  ఆయన్ను ఓ మూలగా కూర్చోపెట్టారని, రాష్ట్ర ప్రధమ పౌరుడిగా తగిన గౌరవం ఇవ్వలేదని, తనను మీడియా సైతం సరిగా చూపించలేదని వాపోయారు.  దుర్గాపూజ సమయంలో దుర్గామాత సాక్షిగా తనకు అవమానం జరిగిందని అన్నారు.  


ఇది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదని, బెంగాల్ ప్రజలందరికి జరిగిన అవమానం అని పేర్కొన్నారు.  తనకు అవమానం జరిగినా.. మనసు గాయపడిన.. తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తిస్తానని, బాధాతప్త హృదయంతో పేర్కొన్నారు.  దుర్గాపూజలో జరిగిన అవమానాన్ని దిగమింగుకొని మరి పని చేసినట్టు అయన చెప్పుకొచ్చారు.  గతంలోనూ తనకు కొన్ని అవమానాలు జరిగాయని, వాటిని నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు.  


ప్రభుత్వం ఏర్పాటు చేసిన పూజ కాబట్టి ప్రభుత్వం తరపున గవర్నర్ హాజరు అవుతారు.  ఆయన చేతుల మీదుగానే అన్ని జరగాల్సి ఉంటుంది.  అలా కాకుండా జరిగితే.. దానివలన జరిగే అనర్ధాలు అన్ని ఇన్ని కావు.  చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది.  కేంద్రం నుంచి మొట్టికాయలు పడతాయి.  అసలే బెంగాల్ లో మమతా బెనర్జీ కి కేంద్రానికి ఒక్కనిమిషం కూడా పడదు.  మరి దీనిని కేంద్రం సీరియస్ గా  తీసుకుంటుందో  లేదో చూడాలి. సీరియస్ గా తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: