ఉదయం లేచిన వెంటనే అందరు ఈరోజు న్యూస్ ఏమున్నదో చూసుకోవడం పరిపాటి.  అయితే గత కొంతకాలంగా లేచిన వెంటనే చూసే న్యూస్ లో తప్పకుండా పెట్రోల్ ధారలా గురించి ఉంటుంది.  ఎందుకంటే.. బయటకు వెళ్ళాలి అంటే వాహనం కావాలి. అందులో పెట్రోల్ ఉండాలి.. లేదంటే కనీసం డీజిల్ అయినా ఉండాలి.  అందుకే లేచిన వెంటనే బండిలో పెట్రోల్ వేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కలు చూసుకుంటారు.  


గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి.  పెట్రోల్ ధరలు ఈరోజు స్థిరంగా ఉండటం విశేషం.  కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ఈ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి.  దేశంలో అన్ని ప్రాంతాల్లోను స్థిరమైన ధరలు ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.  హైదరాబాద్ లో పెట్రిల్ ధర లీటర్ రూ.77.91 /- గా ఉంటె డీజిల్ ధర 77.42/-గా ఉన్నది.  


ఇక అమరావతిలో కూడా స్థిరమైన ధరలు కనిపించాయి.  అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 77.52/- గా ఉంటె, డీజిల్ ధర రూ. 71.70/-గా ఉన్నది.  ఇక విజయవాడలోను ఏ మార్పు లేదు.  అక్కడ లీటర్ పెట్రోల్ రూ. 77.16/-గా ఉంటె, డీజిల్ ధర 71.35/-గా ఉన్నది.  అలానే ఢిల్లీలోను ధరలు స్థిరంగా ఉన్నాయి.  ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవడం విశేషం.  


ఢిల్లీ లీటర్ పెట్రోల్ ధర రూ. 73.27/-గా ఉంటె, డీజిల్ ధర రూ. 66.41 గా ఉన్నది.  వాణిజ్యరాజధాని ముంబై విషయానికి వస్తే.. ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 78.88 గా ఉంటె, డీజిల్ ధర రూ. 69.61గా నిలకడగా ఉండటం విశేషం.  ఇక ఇదిలా ఉంటె, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మాత్రం పెరిగినట్టుగా తెలుస్తోంది. క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 0.17 శాతం పెరిగి 58.84 డాలర్లకు చేరుకోవడం విశేషం.  ధరలు స్థిరంగా ఉన్నా, లేదంటే ధరలు తగ్గినా అది సామాన్య ప్రజానీకానికి మంచిదనే చెప్పాలి.  అలా కాకుండా క్రూడాయిల్ ధరలు పెరిగాయని పెట్రోల్, డీజిల్ ధరలు కేసుల పెరిగితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: