ఈ మద్య మనిషి చిన్న చిన్న విషయాలకు త్రీవస్థాయిలో కోపం తెచ్చుకోవడం..ఎదుటి మనిషిపై దాడి చేయడం తర్వాత ఆలోచించడం జరుగుతుంది.  ఇలాంటి స్వభావం ఉన్నవారు నేరస్థులుగా మారి జైలు జీవితాల్ని అనుభవిస్తున్నారు.  ఇక పార్టీల మద్య తగువులు కామన్ అన్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా ఎన్నికల సమయంలో తమ నాయకుడు గొప్ప అంటే తమ నాయకుడు గొప్ప అనుకుంటూ గొడవలు పడటం సర్వ సాధారణం. ఎన్నికల సందర్బంలో ఇలాంటివి సహజం..గోడవలు జరగడం, పోలీసు కేసలు నమోదు కావడం చూస్తూనే ఉంటాం.


ఇక గ్రామాల్లో పార్టీ వర్గాల మద్య కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి..కొన్ని సార్లు అవి హత్యలకు కూడా దారి తీస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా పుట్టగొడుగుల కోసం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని కుంటిభద్రలో జరిగిందీ ఘటన.  పుట్టగొడుగులు విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో మాటా మాటా పెరిగిపోవడంతో రెచ్చిపోయిన ఇరు వర్గాలు బల్లెం, కర్రలతో ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు.


ఈ క్రమంలో కొవ్వాడ యర్రయ్య అనే వ్యక్తి బల్లెంతో కామక జంగం, హిమగిరిపై చేశాడు. కాగా, ఈ దాడిలో గాయపడ్డ జంగం.. పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని వెంటనే కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు... అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య బోడెమ్మ, ఇద్దరు కుమారులు మిన్నారావు, చిరంజీవి ఉన్నారు. మృతుడి భార్య బోడెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యానేరం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొత్తూరు సీఐ ఎల్‌.సన్యాసినాయుడు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: