ఉద్యోగాలు ఎక్కడ వెతికిన దొరకడం లేదని బాధపడుతూ ఇంట్లో కూర్చునే వారికి పలు సంస్దలు శుభవార్తను చెబుతున్నాయి. అందులో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు బుధవారం విజయనగర్ కాలనీలోని హైదరాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్.మైత్రి ప్రియ తెలిపారు. నగరంలోని కెఫే కాఫీ డే, డోమినో పిజ్జా, పయనీర్ ఇ ల్యాబ్స్, కోన ఈ డేలా సొల్యూషన్స్, ఫ్యూచర్ లైఫ్ స్టెల్ ఫ్యాషన్ లిమిటెడ్ కంపెనీలలో 500 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


కనీస విద్యార్హతతో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారిని డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు, పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులను జూనియర్ కిచెన్ ఎగ్జిక్యూటివ్, ఆధార్ ఆపరేటర్, క్యాషియర్, ఫ్యాషన్ కన్సల్టెంట్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, హెల్పర్ తదితర ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి కల అభ్యర్థులు నేడు తమ బయోడేటా, విద్యార్హతల జిరాక్స్ సర్టిఫికెట్లతో విజయనగర్ కాలనీ మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌ లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉ 10:30 గంటలకు జాబ్ మేళాకు హాజరుకావాలని కోరారు.


ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యుర్థులు వివరాలకు యంగ్ ప్రొఫెషనల్ టి. రఘుపతి , 8247656356 లో సంప్రదించాలని మైత్రి ప్రియ తెలిపారు. . ఇదేకాకుండా టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సంస్థ ప్రతినిధి నిరంజన్ తెలిపారు. జంట నగరాలలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం టెక్ మహేంద్ర ఫౌండేషన్ సహకారంతో నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన తెలియజేశారు.


శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్ధులకు వారి విద్యార్హాతలను బట్టి నగరంలోని పలు ప్రముఖ సంస్దలలో ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందని, ఆసక్తి అర్హత గల అభ్యర్ధులు అక్టోబర్ 20వ తేదీ లోపు తమ శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9515665095, 9100330378 ఫోన్‌లలో సంప్రదించాలని కోరారు. మరెందుకు ఆలస్యం ప్రతిభ వుండి అవకాశాలు లేవని బాధపడేవారు త్వరగా వెళ్ళి కలవండి.


మరింత సమాచారం తెలుసుకోండి: