జమ్మూ కాశ్మీర్  ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరుగుతోంది. నిన్న రాత్రి నుండి జవాన్లు మరియు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దక్షిణ కాశ్మీర్ లోని ఒక ఇంట్లో ఉగ్రవాదులు తల దాచుకున్నారనే సమాచారం అందటంతో భద్రతాదళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఉండవచ్చని జవాన్లు అంచనా వేస్తున్నారు. 
 
ఇంటిని చుట్టుముట్టిన జవాన్లపై ఉగ్రవాదులు దాడులు జరపటంతో ఎన్ కౌంటర్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న ఉగ్రవాదులలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని తెలుస్తోంది. అనంతనాగ్ జిల్లా బిజ్ బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఒక ఇంట్లో చొరబడినట్లు సమాచారం రావటంతో జవాన్లు ఇంటిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఆర్టికల్ 370 మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు పెరుగుతున్నాయి. 
 
భద్రతాదళాలు కూడా చొరబాటుదారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు ఆపిల్ పళ్ల లోడ్ తో వెళుతున్న ఒక ట్రక్ డ్రైవర్ ను చంపినట్లు జవాన్లకు సమాచారం అందింది. అధికారికంగా చనిపోయిన ఉగ్రవాదుల గురించి సమాచారం అందాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎన్ కౌంటర్ కొనసాగుతుందని ప్రకటన చేశారు. 
 
ఇంటెలిజెన్స్ సంస్థలకు పాకిస్థాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలు యాక్టివ్ అయినట్లు సమాచారం అందింది. భద్రతా బలగాల్ని లక్ష్యంగా చేసుకొని భీభత్సం సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం ఉగ్రవాదుల జవాన్ల మధ్య కాల్పుల గురించి పూర్తి సమాచారం లభించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇద్దరు ఉగ్రవాదులు ఇప్పటికే చనిపోగా ఒకరు లేదా ఇద్దరు ఇంట్లో ఉన్నారని జవాన్లు అంచనా వేస్తున్నారు. పాక్ నుండి భారత్ లోకి ఉగ్రవాదులు చొరబడకుండా భారత భద్రతాదళాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. 





మరింత సమాచారం తెలుసుకోండి: