కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. దేశంలో ఆర్ధిక శాఖామంత్రిగా పనిచేసిన చిదంబరం ఇప్పుడు కేసులో ఇరుక్కున్నారు. ఐనాక్స్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం అయన తీహార్ జైలులో ఉన్నారు. జైలులో ఉన్న చిదంబరంపై అనేక కేసులు నమోదయ్యాయి.  ఇప్పటికే అనేకసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా కుదరలేదు.  


కాగా, ఇప్పుడు మరోసారి ఈడీ చిదంబరాన్ని ప్రశ్నించేందుకు సిద్ధం అయ్యింది.  తీహార్ జైల్లోనే చిదంబరాన్ని ప్రశ్నించబోతున్నారు.  దీనికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.  మంగళవారం రోజునే ఈడీకి కోర్టు అనుమతులు ఇచ్చింది.  ఆయన్ను ప్రశ్నించేందుకు అన్ని రకాల అనుమతులను కోర్టు మంగళవారం రోజున ఇచ్చింది.  


అవసరమైతే అరెస్ట్ చేసేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.  బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి తీహార్ జైల్లోనే ఈడీ అధికారులు చిదంబరాన్ని విచారిస్తున్నారు.  అయితే, 55 రోజులుగా, ఆగస్టు 21 నుంచి, సీబీఐ, జ్యుడీషియల్‌ కస్టడీల్లోనే చిదంబరం ఉన్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఆయన జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుంది. కోర్టు ఆవరణలోనే ఆయన్ను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా, చిదంబరం గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, బహిరంగంగా విచారించడం, అరెస్ట్‌ చేయడం సరికాదని జడ్జి తెలిపారు. 


కాగా, ఈరోజు చిదంబరాన్ని తీహార్ జైల్లో ప్రశ్నిస్తున్నారు.  ఒకవేళ సరైన విచారణ జరగకుంటే.. చిదంబరాన్ని తిరిగి ఈడీ తన కష్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నది. ఈడీ కష్టడీలోకి తీసుకుంటే.. మరలా అయన జైలు జీవితం గడపాల్సి వస్తుంది.  ఒకవైపు ఈడీ మరోవైపు సిబిఐలు వరసగా చిదంబరాన్ని టార్గెట్ చేశాయి. ఇక మంగళవారం రోజున సుప్రీం కోర్టులో చిదంబరం బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: