జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎల్లోమీడియా విషయం రోజు రోజుకు పెరిగిపోతోంది. తాజాగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) విషయంలో జగన్ ప్రభుత్వంపై పెద్ద కథనాన్నే అచ్చేసింది. ఆ కథనంలో రాసిన వివరాల్లో చాలా వరకూ నిజాలే అయినప్పటికీ వాటన్నింటినీ జగన్ ప్రభుత్వానికి ముడేసేయటమే విచిత్రంగా ఉంది.

 

నిజానికి సిఎంఆర్ఎఫ్ నుండి బాధితులకు చెక్కులు అందటం లేదంటే అందుకు ప్రధానంగా నిందించాల్సింది చంద్రబాబునాయుడునే.  ఐదేళ్ళ పాటు సిఎంఆర్ఎఫ్ ను చంద్రబాబు ప్రభుత్వం అడ్డుగోలుగా వాడేసుకుంది. సుమారు 40 వేల దరఖాస్తులను పెండింగ్ లో పెట్టేసింది. వందలాది కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసింది.

 

టిడిపి నేతల సిఫార్సులను మాత్రమే ఆమోదించింది. రాజకీయాలకు సంబంధం లేని రోగులు ఎంతగా మొత్తుకున్నా పట్టించుకోలేదు. వందల కోట్ల విలువైన చెక్కులను బాధితులకు ఇచ్చినా, ఆసుపత్రులకు ఇచ్చినా అవి చెల్లలేదు. రాష్ట్ర చరిత్రలోనే సిఎంఆర్ఎఫ్ కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవ్వటం చంద్రబాబు హయాంలోనే జరిగింది.

 

సిఎంఆర్ఎఫ్ నిర్వహణలో ఇంతటి అప్రదిష్టను మూటగట్టుకున్న చంద్రబాబు చివరకు అందులోనే నిధులను ఇతరత్రా అవసరాలకు వాడేసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. చివరకు సిఎంగా దిగిపోయేనాటికి సిఎంఆర్ఎఫ్ ఖాతాను పూర్తిగా నాకిపడేశారు. అందుకనే జగన్ సిఎం అయిన తర్వాత బాధితులను అవసరానికి ఆదుకోలేకపోతున్నారు.

 

వాస్తవాలు ఇలా ఉంటే రోగులను ఆదుకోవటంలో జగన్ ప్రభుత్వం ఫెయిలయినట్లు జనాలను తప్పుదోవ పట్టిస్తోంది. ’సిఎంఆర్ఎఫ్ లో సీన్ రివర్స్’ అంటూ మొదటి పేజీలో విషం చిమ్మింది. జగన్ ప్రభుత్వం నాలుగు మాసాల్లో కేవలం వెయ్యి దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేసిందని చెప్పటమే విచిత్రంగా ఉంది. వచ్చిన దరఖాస్తును వచ్చినట్లు ఏ ప్రభుత్వం కూడా డబ్బులు మంజూరు చేయదు. దరఖాస్తు పై పరిశీలన జరిపి అప్పుడు మాత్రమే అవసరమైన నిధులు మంజూరు చేస్తుంది.

 

ఖజానాలో ఖాళీ బొచ్చెను అప్పగించిన తర్వాత కూడా జగన్ ప్రభుత్వం నాలుగు నెలల్లో వెయ్యి దరఖాస్తులు క్లియర్ చేసిందంటే మామూలు విషయం కాదు. నాలుగు నెలలకు వెయ్యి దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేసిందని ఆరోపిస్తున్న ఎల్లోమీడియా చంద్రబాబు హయాంలో పెండింగ్ లో పెట్టిన వేల దరఖాస్తుల గురించి మాత్రం ప్రస్తావించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: