బెంగాల్ లో రాజకీయాలు రోజు రోజుకు మారిపోతున్నాయి.  2021లో బెంగాల్ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.  గత రెండు దఫాలుగా బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు.  కమ్యూనిస్టుల కోటను బద్దలు కొత్త మమతా బెనర్జీ బెంగాల్ లో పాగా వేశారు.  కాగా, ఇప్పుడు బెంగాల్ లో బీజేపీ పాగా వేయాలని చూస్తున్నది.  2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది.  ఐదేళ్ల తరువాత అంటే 2019లో బీజేపీ ఏకంగా 18 సీట్లు గెలుచుకుంది.  


ఐదేళ్ళలో భారీగా బలపడిన బీజేపీ ఇప్పుడు స్థానికంగా కూడా బలం పుంజుకోవాలని చూస్తున్నది.  బెంగాల్ లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నది.  అయితే, ఇప్పడు తెరపైకి మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బిసిసిఐ కొత్త చీఫ్ గంగూలీని తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ.  బెంగాల్ లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా గంగూలీని నియమించబోతున్నట్టు తెలుస్తోంది.  


ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ ఎంపీగా గౌతమ్ గంబీర్ ఎన్నికైన సంగతి తెలిసిందే.  2019లో పార్టీలో చేరిన గౌతమ్ గంబీర్.. ఢిల్లీ నుంచి విజయం సాధించారు.  ఢిల్లీలోన ఏడు పార్లమెంట్ నియోజక వర్గాల్లో బీజేపీ విజయబావుటా ఎగరవేసింది.  ఇప్పుడు దృష్టిని బెంగాల్ పై పెట్టింది.  అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న బీజేపీ, 2021లో జరిగే ఎన్నికల్లో సైతం విజయం సాధించాలని చూస్తున్నది.  దానికి తగినట్టుగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటోంది.  


దాదా ఇప్పుడు బిసిసిఐకి అధ్యక్షుడిగా నియమితుడైతే.. మరో 2021లో ఆపదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.  ఆ తరువాత గంగూలీ బీజేపీలో జాయిన్ అవుతారని, బెంగాల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా గంగూలీని నియమిస్తారని అంటున్నారు.  కానీ, అలాంటిది ఏమి లేదని గంగూలీ చెప్తున్నాడు.  తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నారు గంగూలీ.  


మరింత సమాచారం తెలుసుకోండి: