పూర్వకాలంలో మనుషుల ఆరోగ్యం ఎంత గట్టిగా ఉండేదో చెప్పక్కర్లేదు.  మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పని సరిగా సరైన ఆహారం తీసుకోవాలి.. సరైన నిద్ర ఉండాలి.. సరైన నియమాలు పాటించాలి.  అలా కాకుండా నియమాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. 


ఇక ఇప్పటి పరిస్థితులను బేరీజు చేసుకుంటే, మనుషులు ఎలా ఉంటున్నారో.. ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. ఆరోగ్యం కోసం నిత్యం జిమ్ లకు, రిక్రియేషన్ పార్క్ లకు వెళ్తుంటారు.  ఒకప్పుడు 60 లేదా 70 ఏళ్ళు వచ్చినా పిల్లలను కనే సత్తా మహిళలకు ఉండేది.  ఇప్పుడు 30 దాటితే కష్టంగా మారుతున్నది.  ఇక 40 దాటక పిల్లలు పుట్టారంటే దానిని ఒక గొప్ప వార్తగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  


అయితే, ఇటీవలే గోదావరి జిల్లాకు చెందిన ఎర్రమట్టి మంగమ్మ అనే మహిళ గుంటూరులోని ఓ హాస్పిటల్ లో ఐవీఎం పద్దతి ద్వారా కవల బిడ్డలకు జన్మను ఇచ్చింది.  ఈ న్యూస్ సోషల్ మీడియా వైరల్ అయిన సంగతి తెలిసిందే.  ఆ తరువాత ఇప్పుడు మరోబామ్మ ఆడపిల్లకు జన్మను ఇచ్చింది.  ఆమె వయసు 75 సంవత్సరాలు.  ఈ వయసులో బిడ్డకు జన్మను ఇవ్వడం ఏంటో ఎవరికీ అర్ధంకాలేదు.  


దీనికి ఓ కారణం ఉన్నది.  ఈ బామ్మకు బిడ్డలు లేరు. దీంతో ఓ అమ్మాయిని పెంచుకుంది.  అయితే, ఆ అమ్మాయి ఈ బామ్మను కొట్టిందట.  దీంతో ఆ బామ్మకు కోపం వచ్చింది.  ఎలాగైనా బిడ్డను కనాలని అనుకుంది.  రాజస్థాన్ లోని కోటా లోని కింకార్ హాస్పిటల్ లో ఐవీఎమ్ పద్దతి ద్వారా బిడ్డకు జన్మను ఇచ్చింది.  అయితే, ఈ బామ్మకు గతంలో క్షయ వ్యాధి ఉన్నది.  దీంతో ఆమెకు ఒక ఊపిరితిత్తి మాత్రమే పనిచేస్తున్నది.  


నెలలు నిండక ముందే బిడ్డను ఆపరేషన్ చేసి తీశారు.  ప్రసుత్తం  తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది.  కాగా, ఇద్దరినీ అబ్జర్వేషన్లో ఉంచినట్టు తెలుస్తోంది.  వయసు పెరిగిన వ్యక్తులకు ఐవీమ్ పద్దతి ద్వారా బిడ్డలు పుట్టించడం వైద్యశాస్త్ర రీత్యా నేరం.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నది.  వీరి ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే.. హాస్పిటల్ పై చర్యలు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: