దొంగతనం చేయాలి అని మనసుకు తట్టినపుడు దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకొని దొంగలు దొంగతనం చేస్తుంటారు.  అలా చేసే సమయంలో తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు.  ఆలా చేసిన పొరపాటు కారణంగా ఇబ్బందుల్లో పడుతుంటారు.  ఒక్కోసారి చేస్తున్న దొంగతనం రివర్స్ అయ్యి బెడిసికొడుతుంది.  పరువు పోతుంది.. ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  అలాంటి వాటిల్లో ఒకటి ఈ దొంగతనం.  


ఇటీవలే ఇంగ్లాండ్ లోని డార్హం ప్రాంతానికి చెందిన ఓ దొంగగారు దొంగతనం చేయాలని అనుకున్నాడు.  మాములుగా జాగింగ్ డ్రెస్ లో వెళ్తూన్న ఆ దొంగకు ఒంటరిగా ఉన్న ఓ కారు కనిపించింది.  అందులో ఎలాంటి వస్తువులు ఉన్నాయో తెలియదుగాని, ఆ దొంగ కన్ను కారుపై పడింది.  చూసిన వెంటనే చేతికి దురద వేసింది.  ఇక ఒక్క క్షణం కూడా ఆగలేదు.  ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.  


వెంటనే అక్కడే ఉన్న ఓ ఇటుకను తీసి బలంగా కారు డోర్ పైకి విసిరి కొట్టాడు.  ఆ డోర్ కు తగిలిన ఇటుక రివర్స్ అయ్యి దొంగగారి ముఖానికి బలంగా తాకింది.  ఎంత దొంగ అయినా దెబ్బ తగిలితే డుచుకొని పోవడానికి అదేమీ సినిమా కాదుకదా.. రియల్ లైఫ్.  చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేము.  ఇక పెద్ద దెబ్బ తగిలితే తట్టుకోగలమా చెప్పండి.  ఇక్కడ అలాగే జరిగింది. దొంగగారికి తగిలిన దెబ్బకు అమాంతం బెంబేలెత్తాడు.  లబోదిబో అన్నాడు.  


ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  ఈ వీడియోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు.  దొంగగారికి మంచి బుద్ది చెప్పారని కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం మంచిగానే జరిగిందని అంటున్నారు.  మొత్తానికి దొంగగారికి దేవుడు మంచి బుద్ది చెప్పారు.  పనిచేసుకుని పోషించుకునే సత్తా ఉన్నా కూడా ఎందుకని ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: