మొన్నటి ఎన్నికల్లో తగిలిన దారుణమైన పరాభవాన్ని చంద్రబాబునాయుడు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం. నిజానికి రాజకీయపార్టీలన్న తర్వాత ఎన్నికల్లో గెలుపోటములు చాలా సహజం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి చేతిలో తిన్న చావుదెబ్బ చంద్రబాబును మానసికంగా చాలా దెబ్బతీసింది. అందుకనే జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

 

తాజాగా నెల్లూరు పర్యటనలో మాట్లాడుతూ జగన్ వల్ల సమాజానికి అరిష్టమంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని నాలుగు నెలల్లోనే జగన్ బీహార్ లాగ తయారు చేశారని చెప్పటంలో అర్ధమే లేదు. అసలు చంద్రబాబు హయాంలోనే సమాజానికి అరిష్టం పట్టుకుందని జనాలు అనుకున్నారు.  చంద్రబాబే రాష్ట్రాన్ని మరో బీహార్ లాగ మార్చేసినట్లు జనాలు అభిప్రాయపడ్డారు.

 

మెజారిటి జనాల అభిప్రాయమే మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోరఓటమి. వాస్తవం ఇలాగుంటే చంద్రబాబు మాత్రం ఇంకా రివర్సులోనే మాట్లాడుతున్నారు. వచ్చిన సమస్య ఏమిటంటే కొన్నిసార్లు ఇంకా తానే అధికారంలో ఉన్నట్లు చంద్రబాబు భ్రమలో ఉన్నట్లున్నారు. అందుకనే పోలీసులను, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

 

తాను అధికారంలో ఉన్నపుడు అధికారులపై ఎంఎల్ఏలు, ఎంపిలు చేసిన దాడులను చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. వివాదాలు పెద్దది కాకుండా స్వయంగా తానే అధికారులను పిలిపించి ఎంఎల్ఏలు, ఎంపిలకు మధ్యవర్తిత్వం చేసిన విషయం అందరూ చూసిందే. కానీ జగన్ హయాంలో అలా జరగటం లేదు. అధికార పార్టీ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారంటేనే లా అండ్ ఆర్టర్ ఎలా పనిచేస్తోందో అర్ధమవుతోంది.

 

నిజానికి చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రం ఏమీ బీహార్ లాగ కాలేదు. జగన్ పాలనతో సమాజానికి అరిష్టమని జనాలెవరూ అనుకోవటం లేదు. సమస్యంతా చంద్రబాబు అండ్ కో లో ఉంది కాబట్టే జగన్ పాలనను తట్టుకోలేకపోతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వాళ్ళన్నా, మాట మీద నిలిచే వాళ్ళన్నా చంద్రబాబుకు ఎలర్జీ. ప్రతీ రాజకీయ నేత తననే ఆదర్శంగా తీసుకోవాలని అనుకుంటుంటారు. అందుకు భిన్నంగా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళపై బురద చల్లటం మొదలుపెడతారు. ఇపుడు చంద్రబాబు చేస్తున్నది అదే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: