ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ చెపాటున సమ్మె రోజురోజుకు ఉధృతమవుతుంది. కార్మికులకు మద్దతుగా విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సైతం సమ్మెలో పాల్గొనడంతో ఉద్యమ రూపం దాల్చుతుంది. ఈ క్రమంలో  కార్మికులకు మద్దతుగా సిపిఐ సామూహిక దీక్షలకు దిగింది. దీనితో సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన  సమ్మె కాస్తా తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుంది.  రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు బస్సు డిపోల ఎదుట ధర్నాలు, మానవహారాలు చేపట్టారు. కరీంనగర్ మెదక్ , సిద్దిపేట, సంగారెడ్డి  తదితరజిల్లాల్లోని బస్సు డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్మికులకు మద్దతుగా విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. ఈ క్రమంలో సిపిఐ కూడా కార్మికులకు బాసటగా నిలిచారు.


ఇప్పటికే హుజునగర్ లో జరుగుతున్న అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికల్లో టీఆరెస్ కు మద్దతు ఇచ్చే విషయంలో ఆ పార్టీ పునరాలోచనలో పడిన సంగతి తెలిసిందే. కార్మికులకు మద్దతుగా పొత్తు లేదంటూ తెగేసి చెప్పడంపై చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మరోవైపు ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు టిఎన్‌జిఓ, టిజిఓ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మి కుల డిమాండ్లు న్యాయబద్ద మైనవే నని, తమకు అవకాశమిస్తే ప్రభుత్వంతో మధ్య వర్తిత్వం చేసేందుకు సిద్ధమని టిఎన్జివో నేత రవీందర్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రవాణా  శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యమంలో మరణించిన వ్యక్తులకు ప్రభుత్వం యాభై లక్షల రూపాల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అదేవిధంగా  వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం తో పాటు మూడెకరాల భూమి,  డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.



ఆర్టీసీ సమ్మె సందర్భంలో డ్రైవర్ నిర్లక్ష్యం వలన చాలామంది దాదాపు 50 మంది వరకు ఆర్టీసీ ప్రమాదంలో చనిపోయారు వారి కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కూడా డిమాండ్ చేయడం గమనార్హం. కోర్టు చెప్పిన  తీర్పు ప్రకారం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి  డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మె సమయంలో వారికి జీతాలు చెల్లించి సమ్మె బాధ్యత పూర్తిగా  ప్రభుత్వం బాధ్యత వహించి మళ్లీ ఆర్టీసీ కి పూర్వ వైభవాన్ని రావాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే దురుద్దేశ్యంతోనే సమ్మెపై ఉక్కుపాదం మోపుతున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సమ్మె చేయడం కార్మికుల ప్రజాస్వామ్య హక్కు అని చెప్పారు. కార్మికులతో చర్చలు జరిపి సమ్మె విరమిం పజేసేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.  ఆర్టీసీ  భూములను పూర్తిగా పరిరక్షించాలి కబ్జాదారుల నుండి ఆ భూములను ప్రభుత్వమే అధికారికంగా కాపాడాలని  డిమాండ్ చేశారు. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: