ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే సుజనా చౌదరి అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. ఎందుకంటే ఫొటోలో ఉన్న వ్యక్తి అంత పాపులర్ కాబట్టి. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన ఘన చరిత్ర ఆయనది. ఓ బ్యాంకుతో వివాదం వల్ల కేంద్రమంత్రిగా ఉన్నపుడే అరెస్టు వారెంటు అందుకున్న గొప్పోడు సుజనా చౌదరి.

 

ఇలాంటి ఆర్ధిక నేతచరిత్ర ఉన్న సుజనా కూడా ’మదిలో మహాత్ముడు’ అనే మహాత్మా గాంధి సంకల్ప యాత్రకు పూనుకోవటమే విచిత్రం. మహాత్ముడు చెప్పిన ప్రతీ సూక్తికి విరుద్ధంగా నడుచుకునే ఈ కేంద్ర మాజీ మంత్రి కూడా మహాత్ముని పేరుతో కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో ర్యాలీ నిర్వహించారు.

 

విచిత్రమేటంటే ఈయన ఆర్ధిక నేర చరిత్ర తెలిసిన చాలామంది బిజెపి నేతలు ర్యాలీలో ఈయన వెనకాల అడుగులు వేసి అనుసరించటం. ఇటువంటి నేత ప్రాంతీయ పార్టీలతో ఎటువంటి ఉపయోగం ఉండదని తాజాగా చెప్పారు. విచిత్రమేమిటంటే ప్రాంతీయ పార్టీల వల్ల నష్టపోయిన వాళ్ళల్లో తాను కూడా ఒకడినని ఈయన చెప్పుకోవటం.

 

తన రాజకీయ జీవితాన్ని సుజనా ఆరంభించిందే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశంతో.  ప్రత్యక్ష రాజకీయాల్లో పోటి చేస్తే ఆయనకు ఎన్ని ఓట్లు వస్తాయో ఎవరూ చెప్పలేరు. అలాంటి సుజనా తనకు చంద్రబాబుతో ఉన్న ఆర్దిక సంబంధాల వల్లే నాయకుడిగా చెలామణిలోకి వచ్చారు. కేవలం చంద్రబాబు దయతోనే రాజ్యసభకు రెండుసార్లు ఎంపికయ్యారు.

 

రెండోసారి  రాజ్యసభకు ఎంపికయ్యే సమయానికే సుజనాపై ఆర్ధిక నేర ఆరోపణలు, కేసులు ఉన్నాయి. అయినా చంద్రబాబు పట్టుపట్టడం వల్లే నరేంద్రమోడి కేంద్రంలో సహాయమంత్రిగా అవకాశం ఇచ్చారు. అంటే ఈయన రాజకీయ చరిత్రంతా ఓ ప్రాంతీయ పార్టీ పెట్టిన బిక్షే అన్నది అర్ధమవుతోంది. అలాంటి సుజనా కూడా ప్రాంతీయ పార్టీల ఉపయోగాలు లేవని, తాను నష్టపోయానని కతలు వినిపిస్తున్నారు.  పైగా  రాష్ట్ర రాజకీయాలను చంద్రబాబు, వైఎస్సార్ గుప్పిట పెట్టుకున్నట్లు ఆరోపించటమే విచిత్రంగా ఉంది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: