హైదరాబాద్ బేగంపేట్ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి టీఆర్టీ, పీఈటీ అభ్యర్థులు ప్రయత్నించారు. 400 పోస్టులకు రెండు సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారని ఫలితాలు ఇప్పటికీ ఇవ్వలేదని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. కోర్టు కేసులు క్లియర్ అయినప్పటికీ ప్రభుత్వం ఫలితాలు మాత్రం ఇవ్వటం లేదని అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు.  టీఆర్టీ, పీఈటీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకోగా వారు ప్రతిఘటించారు. 
 
అభ్యర్థులు ప్రతిఘటించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని తెలుస్తోంది. పోలీసులు చివరకు బలవంతంగా అభ్యర్థుల్ని అక్కడినుండి తరలించారు. ఆందోళన చేసిన అభ్యర్థులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించివేస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు మాట్లాడుతూ 2017లో నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పటివరకు ఫలితాలు ఇవ్వలేదని ఈరోజు రేపు అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బ్రతకాలో చావాలో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇప్పటివరకు 50సార్లకు పైగా ధర్నాలు చేశామని అభ్యర్థులకు చనిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. రెండు రోజుల్లోగా పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వంనుండి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు దీక్షను కొనసాగిస్తామని అభ్యర్థులు చెబుతున్నారు.  పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో దీక్షను కొనసాగిస్తామని అభ్యర్థులు చెబుతున్నారు.  మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించటానికి ఎవరు ప్రయత్నించినా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. 
 
సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయటానికి ఎటువంటి అనుమతులు లేవని అందువలన అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. మరో అభ్యర్థి మాట్లాడుతూ మూడు సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నానని ఫలితాలు ఇవ్వకుండా రెండు సంవత్సరాల నుండి కాలయాపన చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. ఒక లేడీ అభ్యర్థి మాట్లాడుతూ పోస్టింగ్ ఇవ్వకపోతే మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలని చెబుతోంది. అభ్యర్థులు తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కారించాలని ఫలితాలు విడుదల చేసి 1:1 రేషియోలో పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: