ఆడపిల్లలకు రక్షణ కరువైపోతోందని దేశంలో జరుగుతున్న ఎన్నో విషాదకర సంఘటనలు రుజువు చేస్తున్నాయి. కామాంధుల కామ దాహానికి బలైపోతున్న ఘటనలెన్నో చూస్తున్నాం. కానీ.. తాను జన్మనిచ్చిన కూతురిపైనే అత్యాచారానికి యత్నించాడో కామాంధుడు. కన్న తండ్రి ఘాతుకాన్ని పసిగట్టిన ఆ బాలిక చాకచక్యంగా వ్యవహరించింది. కామాంధుడి రూపంలో వచ్చిన తండ్రి చెర నుంచి తప్పించుకుని పక్కటింకి వెళ్లిన ఆ బాలిక జరిగిన విషయం చెప్పింది. 

 

 

హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్ పరిధిలోని బోరబండలో నివసిస్తున్న ఓ వ్యక్తి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె(9) ఉన్నారు. మంగళవారం రోజు ఆ సమయంలో తన కుమార్తె తప్ప ఇంట్లో కుటుంబసభ్యులెవరూ లేరు. ఇదే అదనుగా ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెపై ఆ కామాంధుడు అత్యాచారం చేయబోయాడు. కన్నతండ్రే తన జీవితాన్ని చెరబట్టడానికి ప్రయత్నిస్తున్న దారుణాన్ని పసిగట్టిన బాలిక అక్కడి నుంచి తప్పించుకుని పక్కింటికి పరుగులు తీసి విషయం చెప్పింది. దీంతో తన బండారం ఎక్కడ బయటపడటంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

 

 

ఇంతలో ఇంటికి వచ్చిన తల్లికి బాలిక విషయం చెప్పుకుని ఘొల్లుమంది. దీంతో బాలిక తల్లి ఎస్సార్ నగర్ పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. కన్నకూతురిపైనే అఘాయిత్యానికి యత్నించిన తన భర్తపై కఠినచర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. బాలికల రక్షణకు దేశంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట పడడం లేదు. కన్న కూతురిపైనే ఇటువంటి దారుణానికి ఒడిగట్టడం సభ్య సమాజం తల దించుకోవాల్సిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: