మళ్లీ నల్లమల వివాదం తెరపైకి వచ్చినట్టు అనిపిస్తుంది. నల్లమలలో యురేనియం నిక్షేపాలు కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోందా? ఒక పక్క యురేనియం వెలికితీతకు అనుమతి  ఇవ్వబోమని తెలుపుతున్న ప్రభుత్వం మరోపక్క యురేనియం వెలికితీతపై దృష్టి పెడుతుందా? అని తాజాగా నల్లమలలో జెట్ విమానం భూమికి అతి దగ్గరగా చక్కర్లు కొట్టడంతో ఈ అనుమానాలకు దరి తీస్తుంది.


నల్లమల అటవీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం జెట్ విమానం చక్కర్లు కొట్టడం ఇందుకు ముఖ్య కారణం అవుతుంది. నల్లమల ఏజెన్సీ గ్రామాల్లో చాలా సేపు జెట్ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో గిరిజన ప్రజలలో ఆందోళనలు రేపుతుంది. యురేనియం వెలికితీతకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన  ప్రకటనతో ఊపిరి పీల్చుకున్న నల్లమల ప్రాంతవాసులు నిన్ను జెట్ విమానం చక్కెర్లు కొట్టడంతో ఏమి అవుతుందో అని భయాందోళనకు గురికావడం జరిగింది.


నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పెద్దగట్టు, సంభాపురం, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని సార్లపల్లి, పెట్రాల్ చేను గ్రామాల పరిధిలో మంగళవారం జెట్ విమానం చక్కర్లు కొట్టడం జరిగింది. భూమికి అతి సమీపంలోకి వచ్చి జెట్ విమానం తిరగడంతో యురేనియం నిక్షేపాల కోసమేనా అన్న అనుమానం గిరిజనుల్లో మొదలు అయంది. ముఖ్యంగా యురేనియం నిక్షేపాలు ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఈ జెట్ విమానం సంచరించడం జరిగింది.


నల్గొండ జిల్లా నేరేడు గొమ్ము, చందంపేట మండలం లోని గుట్టలు, నాగార్జున జలాశయం పైన కూడా ఈ జెట్ విమానం పలు సార్లు చక్కర్లు కొట్టింది అంటే నమ్మండి. అయితే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్వే చేపట్టి ఉంటారని, ఇదంతా యురేనియం నిక్షేపాలు కోసమేనని అక్కడ ఉన్న స్థానికులు అనుమాన పడుతున్నారు. అలాగే నెల రోజుల క్రితం కూడా ఓ హెలికాఫ్టర్ ఈ ప్రాంతంలో తిరిగినట్లు స్థానికులు వేలాడిస్తునారు. జెట్ విమానాలు,హెలికాఫ్టర్ లు తిరుగుతుండటం యురేనియం నిక్షేపాల కోసమేనా అని భయాందోళనలకు గురిఅవుతున్నారు స్థానిక ప్రజలు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కు బిక్కు మంటూ  భయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: