అమెరికాలో రట్జర్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు అమెరికాలో లైంగిక విఙ్జానంపై సర్వే నిర్వహించారు. ఆ ఆ అభిప్రాయ సేకరణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పోల్‌లో పాల్గొన్న 83 శాతం మంది ఓటర్లు పిల్లలకు "సెక్స్ ఎడ్యుకేషన్ అంటే లైంగిక విఙ్జానం" చాలా అవసరమని చెప్పారట. లైంగిక విఙ్జానం — ప్రస్తుత తరుణంలో హాట్-టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా, ఎవర్ని కదిలించినా, పిల్లలకు లైంగిక విఙ్జానం పాఠాలు అవసరమా? లేదా? అవసరమైతే ఎంతవరకు? లైంగిక విఙ్జానంపై పిల్లలకు అవగాహన వస్తే నష్టం లేదా?  అన్న వివిధ విషయాలపై చర్చ జరుగుతోంది.
SEX <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=EDUCATION' target='_blank' title='education-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>education</a> in Schools కోసం చిత్ర ఫలితం
సోనాక్షి సిన్హా — బాలీవుడ్ హీరోయిన్  కూడా పిల్లలకు  లైంగిక విఙ్జానం చాలా అవసరమని వ్యాఖ్యానించింది. ఆమెతో పాటు చాలా మంది నటీనటులు, విద్యావేత్తలు, మేధావులు లైంగిక విద్యపై తమ అభిప్రాయాన్ని వరసగా వ్యక్తం చేస్తున్నారు. అతిదగ్గర బంధువుల నుండి అది గృహవాతావరణంలో సైతం పసివాళ్ళ నుండి పండు ముదుసలి వరకు  వయోభేదం లేకుండా రేప్‌లు, లైంగిక వేధింపులకు గురవటం ఎక్కువవుతున్న తరుణంలో  "లైంగిక విఙ్జాన బోధన" తెర పైకి వచ్చింది. ముఖ్యంగా ఇంట్లో, పాఠశాలలలో, కళాశాలలలో, పనిచేసే కార్యాలయాల్లో, చివరకు నడిబజార్లలో — మహిళలు ప్రత్యేకించి  పసిపిల్లలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో దీనిపై చర్చ జరగటం తీవ్రమైంది. 
SEX <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=EDUCATION' target='_blank' title='education-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>education</a> in Schools కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే బ్రిటన్‌ లోని పలు పాఠశాలల్లో పిల్లలకు  "లైంగిక విఙ్జాన బోధన" పాఠాలు మొదలయ్యాయి. రమారమీ 240 పైగా ప్రాధమిక పాఠశాలలలో ‘మీ సెక్స్ ఎడ్యుకేషన్’ కార్యక్రమంలో భాగంగా పాఠాలను బోధించనున్నారు.
SEX <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=EDUCATION' target='_blank' title='education-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>education</a> in Schools కోసం చిత్ర ఫలితం
‘టచింగ్ ప్రైవేట్ పార్ట్స్ బై అదర్స్’ — జననాంగాలను ఇతరులు తాకటం గురించి పిల్లలకు చెప్పనున్నట్లు అక్కడి విద్యాశాఖ స్పష్టం చేసింది. పిల్లల జననాంగాలను ఇతరులు అసభ్యంగా తాకడం, వారిని సెక్స్‌కు ప్రేరేపించడం లాంటివి చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని టీచర్లు విద్యార్థులను బోధించనున్నారు. బ్రిటన్‌లోనే కాదు మరిన్ని పాశ్చాత్య దేశాల్లో,  పిల్లలకు సెక్స్ పాఠాలు బోధించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి, దీనిపై ప్రజాభిప్రాయం ఏంటో తెలుసు కోవాలనుకున్న "రట్జర్స్ వర్సిటీ" శాస్త్రవేత్తలు అమెరికాలో అభిప్రాయసేకరణ — సర్వే  నిర్వహించారు.
SEX <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=EDUCATION' target='_blank' title='education-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>education</a> in Schools కోసం చిత్ర ఫలితం
ఆ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే,

*పోల్‌ లో పాల్గొన్న 83 శాతం మంది ఓటర్లు పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమని చెప్పారట
*15 శాతం మంది కొంతవరకు ముఖ్యమేనని,
*2 శాతం మంది లైంగిక విద్య అవసరం లేదని వెల్లడించారట.
*మరో 2 శాతం మంది తమ అభిప్రాయం చెప్పలేదట.
*మాధ్యమిక విద్యను అభ్యసించే సమయంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలని 64 శాతం మంది సూచించగా
*25 శాతం మంది కొంత వరకే బోధించాలని,
*సెక్స్ ఎడ్యుకేషన్ అసలే బోధించ వద్దని 4 శాతం మంది వెల్లడించారట.
Image result for lesly cantor Rutgers University
ఈ సర్వేపై మాట్లాడిన రట్జర్స్ వర్సిటీ ప్రొఫెసర్ లెస్లీ కాంటర్, టీనేజ్ వయసులో 'ప్రెగ్నెన్సీ' ని నిరోధించేందుకు, సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ (ఎస్టీడీ) రాకుండా ఉండేందుకు లైంగికవిద్య అవసరమని తమ పోల్‌ లో తేలిందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: