ఆంధ్ర ప్రదేశ్లో ఎటువంటి పాలన అనుభవం లేకపోయిన ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ సీఎం జగన్ ప్రజల ఆదరణ పొందుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలలో  అనేక సంచలన నిర్ణయాలు - పథకాలు ప్రవేశ పెట్టడం చూశాం. జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయాలు - పథకాల వల్ల అన్నీ వర్గాల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారనే తెలుస్తుంది.  అయితే జగన్ తీసుకున్నకొన్ని నిర్ణయాల పట్ల అందరి కంటే నిరుద్యోగులు ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు అన్న మాట వాస్తవం.


ఎందుకంటే జగన్ చెయిపట్టిన  పాదయాత్ర సందర్భంగా జగన్ ఎక్కువగా గుర్తించిన సమస్య నిరుద్యోగం. దశాబ్దం పైగా ఏపీని నిరుద్యోగ సమస్య బాగా పట్టిపీడిస్తోంది. ప్రభుత్వాలు మారినా ఈ సమస్యకి పరిస్కారం చూడలేక పోయారు. కానీ జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోపే నిరుద్యోగ సమస్యను తీర్చారంటే నమ్మండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది  అని భావించిన జగన్..గ్రామ / వార్డు వాలంటీర్లు - గ్రామ/వార్డు సచివాలయాల పేరిట లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అలాగే ప్రభుత్వ వైన్ షాప్ ల్లో కూడా నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించడం జరిగింది.


ఇక ప్రతి ఏడాది జనవరిలో రాష్ట్రంలో ఖాళీ ఉన్న ప్రతి పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేసి భర్తీలు చేస్తాము అని హామీ కూడా ఇచ్చారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే  స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అంటూ తీసుకున్న నిర్ణయం మరో ఎత్తు. దీని వల్ల 75 శాతం ప్రభుత్వం - ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు స్థానికులకే లభిస్తున్నాయి.ఈ విషయానికి సంబంధించిన బిల్లుని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టి ఆమోదించడం కూడా జరిగింది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలను ఫ్యాక్టరీలను నెలకొల్పడం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధిని కల్పించాలని కూడా నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.


దీని వల్ల ప్రతి యువకుడు లబ్ది లభిస్తుంది అని తెలిపారు. ఇక ఈ నిర్ణయంపై నిరుద్యోగ యువత కూడా సంతృప్తిగా ఉంది. ఈ నిర్ణయాని వాలంటీర్లుసచివాలయాల ఉద్యోగాల్లో విజయవంతంగా అమలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: