మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ పార్టీకి చెందిన అత్యంత ముఖ్య నేతలను చిరంజీవి ఈరోజు కలవనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యను చిరంజీవి కలవనున్నారు. వెంకయ్యతో కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాను చిరంజీవి వీక్షించనున్నారు. ఆ తరువాత అమిత్ షాతో కూడా చిరంజీవి భేటీ కాబోతున్నారు. ప్రధాని నరేంద్రమోదీని చిరంజీవి కలిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 
 
అమిత్ షాను, మోదీని సైరా సినిమా చూడమని చిరంజీవి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమా వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బాహుబలి సినిమా ప్రమోషన్స్ కూడా ఇదే విధంగా చేశారు. ప్రభాస్, కృష్ణంరాజు బీజేపీ పార్టీ ముఖ్య నేతలను కలిసి బాహుబలి సినిమాను వీక్షించాలని బాహుబలి సినిమా విడుదలైన సమయంలో కోరారు. 
 
ఇప్పుడు వీలు కుదరని పక్షంలో హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల తరువాత సైరా సినిమాను చూడాలని చిరంజీవి అమిత్ షా, మోదీని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో చిరంజీవి అపాయింట్ మెంట్ ఇంకా కుదరలేదని ఈరోజు కుదరని పక్షంలో రేపు చిరంజీవి మోదీని కలిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సీఎం రమేష్, రాం మాధవ్ తో కలిసి చిరంజీవి ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది. 
 
ప్రధాని మోదీతో చిరంజీవి భేటీ కాబోతూ ఉండటంతో చిరంజీవి బీజేపీ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. కొన్ని రోజుల క్రితం చిరంజీవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి సైరా నరసింహా రెడ్డి సినిమాను వీక్షించమని కోరిన విషయం తెలిసిందే. సీఎం జగన్ ఖచ్చితంగా చూస్తానని చిరంజీవికి చెప్పినట్లు తెలిసింది. ఈ వారం విజయవాడలోని పీవీపీ మాల్ లో సీఎం జగన్ తన సతీమణితో కలిసి సినిమా చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: